AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: డయాబెటిక్‌ బాధితులకు కరోనా శాపం.. అధ్యాయనంలో వెల్లడైన షాకింగ్ విషయాలు..

Coronavirus: కరోనా మహమ్మారి మానవ జాతిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థికం నుంచి ఆరోగ్యం వరకు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ప్రపంచంలో ఈ మహమ్మారి బారిన పడకుండా..

Coronavirus: డయాబెటిక్‌ బాధితులకు కరోనా శాపం.. అధ్యాయనంలో వెల్లడైన షాకింగ్ విషయాలు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 14, 2022 | 5:48 PM

Share

Coronavirus: కరోనా మహమ్మారి మానవ జాతిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థికం నుంచి ఆరోగ్యం వరకు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ప్రపంచంలో ఈ మహమ్మారి బారిన పడకుండా తప్పించుకున్న దేశం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా మరణించిన వారు కొందరైతే ఈ వ్యాధి నుంచి కోలుకున్నా ఇప్పటికీ దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతోన్న వారు మరికొందరు. ఈ నేపథ్యంలో తాజాగా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మధుమేహంతో బాధపడేరిలో దీర్ఘకాల కోవిడ్‌ ప్రమాదం నాలుగురెట్టు అధికంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వార్షిక సైంటిఫిక్ సెషన్స్‌లో సమర్పించిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగు వారాల పాటు వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. ఇక ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ సమాఖ్య నివేదిక ప్రకారం 2017లో భారతదేశంలో 72.9 మిలియన్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు.

పట్టణ ప్రాంతాల్లో 10.9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 14.2 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 20 ఏళ్లు నిండిన వారిలో 3.0 నుంచి 7.8 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అధికంగా పెరగడం వల్ల దీర్ఘకాలంలో శరీర అవయవాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండెపోటు, నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలన్న దానిపై పలువురు నిపుణులు తెలిపిన వివరాలు…

ఇవి కూడా చదవండి

రక్తంలో చక్కెరను ఆహారం అదుపులో ఉంచుతుందా.?

డాక్టర్ డేవిడ్ చాందీ, ఎండోక్రినాలజీ, సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కన్సల్టెంట్ అండ్‌ సెక్షన్ కో-ఆర్డినేటర్ ప్రకారం.. ‘చక్కెరలను అదుపులో ఉంచుకోవడానికి తీసుకునే ఆహారం, వ్యాధి ఉన్న స్టేజ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఆహారం తీసుకోక ముందు షుగర్‌ లెవల్స్‌ 130 కంటే తక్కువ, తిన్న తర్వాత 180 కంటే తక్కువ ఉంటే సదరు వ్యక్తి మూడు నెలల పాటు వ్యాయామంతో పాటు డైట్‌ను మెయింటెన్‌ చేయాలని సిఫార్స్‌ చేస్తున్నాము’ అని డాక్టర్‌ తెలిపారు.

అర్ధరాత్రి ఆహారం ఎలా ఉండాలి.?

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయాలపై ముంబయిలోని వోకార్డ్ హాస్పిటల్ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్ మాట్లాడుతూ.. ‘మధుమేహ వ్యాధిగ్రస్తులకు సహజంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు అర్థరాత్రి ఏదో ఒకటి తింటుంటారు. అయితే దీనిని నివారించాలి. ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి కూడా అర్థరాత్రి ఇలాంటి స్నాక్స్‌ తినడం ఎంత మాత్రం మంచిది కాదు. అయితే రాత్రుళ్లు యాపిల్‌, నారింజ పాలు వంటి వాటిని మాత్రమే తీసుకోవాలి’ అని షేక్‌ సూచించారు. ఒక వ్యక్తికి డయాబెటిస్‌ నిర్ధారణ అయిన తర్వాత తిరిగి షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలోకి వచ్చినా ఆహారం విషయంలో మార్పులు చేయాల్సిందే. దీనికి కారణం రెగ్యులర్‌ షుగర్‌ లెవల్స్‌ను ఎవరూ పరీక్షించుకోరు. దీంతో షుగర్‌ లెవల్స్‌ పెరిగిన విషయాన్ని గుర్తించలేము. అయితే షుగర్‌ లెవల్స్‌ క్రమంతప్పకుండా కంట్రోల్‌ ఉంటే మాత్రం 15 రోజులకొకసారి నచ్చిన ఆహారం తీసుకోవచ్చని డాక్టర్‌ షేక్‌ తెలిపారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి.?

డయాబెటిస్‌ రోగులు తీసుకోవాల్సిన ఆహారం విషయమై డాక్టర్‌ షేక్‌ మాట్లాడుతూ.. ‘కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి. మాంసహారాన్ని మానేయాలనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే కేవలం రెడ్‌ మీకు దూరంగా ఉంటే చాలు. చికెన్‌, చేపలు తినవచ్చు. అయితే రొయ్యలు, పీతలకు దూరంగా ఉండాలి. వెన్న, నెయ్యి, మైదా వంటి వాటికి దూరంగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొనను వారానికి ఒకటి లేదా రెండుసార్లు తీసుకుంటే మంచిది’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us