Success Story: ఐటి జాబ్‌కు గుడ్ బై చెప్పి గాడిద పెంపకం.. పాలతో లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి
కర్ణాటక వ్యక్తి గాడిద మిల్క్ ఫారమ్ తెరవడానికి ఐటీ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, రూ. 17 లక్షల విలువైన ఆర్డర్‌లను అందుకున్నాడు, తరచూ గాడిదలు తక్కువ విలువ చేసే చూడడం తనను చలింపజేసిందని.. అప్పుడే గాడిదల పెంపకం ఆలోచన వచ్చిందని చెప్పారు యజమాని శ్రీనివాస్ గౌడ.
Success Story: గత కొంతకాలంగా యువతఆలోచనలో మార్పు వస్తోంది. బతకడానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు.. కష్టపడి పనిచేస్తే.. అనేక రంగాలు ఉపాధినిస్తాయని అలోచిస్తూ.. భిన్న ఆదాయమార్గాలను ఎంచుకుంటున్నారు. టి షాప్స్, వ్యవసాయం, టిఫిన్ సెంటర్ ఏది ఎంచుకున్నా.. తన చదువుకు ఆలోచనలు, ఆధునికతను జోడించి సక్సెస్ అందుకుంటున్నారు. తమతో పాటు మరికొందరికి ఉపాధిఅందించే దిశగా అడుగులు వేస్తున్నారు. లక్షల జీతాన్ని ఇచ్చే ఐటీ రంగంలోని ఉద్యోగానికి వదిలి.. గాడిదలను పెంచుకుంటూ.. లక్షలు సంపాదిస్తున్నాడు కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే..
42 ఏళ్ల శ్రీనివాస గౌడ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలి కర్ణాటకలోని దక్షిణ జిల్లాలో గాడిద ఫారమ్‌ను ప్రారంభించాడు. జూన్ 8న ప్రారంభమైన ఈ ఫామ్ కర్ణాటకలో మొదటిది కాగా, కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఒకటి తర్వాత దేశంలోనే రెండోది.
గాడిదలను చాలామంది తృణీకరిస్తూ, చిన్నచూపు చూడటం తనను కదిలించిందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బిఎ గ్రాడ్యుయేట్ అయిన గౌడ, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత 2020లో ఇరా గ్రామంలోని 2.3 ఎకరాల స్థలంలో ఇసిరి ఫామ్స్, సమగ్ర వ్యవసాయం, పశుసంవర్ధక, పశువైద్య సేవలు, శిక్షణ, పశుగ్రాసం అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాడు. మొదటి మేకల పెంపకాన్ని మొదలు పెట్టిన శ్రీనివాస్ తర్వాత కుందేళ్ళు , కడక్‌నాథ్ కోళ్లను కూడా పెంచడం మొదలు పెట్టాడు. అనంతరం గాడిదల పెంపకంపై దృష్టి సారించిన శ్రీనివాస్ గౌడ్ గాడిదల పెంపకాన్ని చేపట్టాడు. ఇపుడు తన ఫారంలో 20 గాడిదలు ఉంటాయని గౌడ తెలిపారు.
లాండ్రీ మెషీన్లు, నార ఉతకడానికి ఇతర సాంకేతికత అందుబాటులోకి రావడంతో గాడిద జాతుల సంఖ్య తగ్గిపోతోందని, వాటిని ధోబీలు వినియోగించడం లేదని అన్నారు. దీంతో తనకు గాడిద పెంపకం ఆలోచన వచ్చిందని.. తన కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ చెప్పినపుడు.. చాలా మంది భయపడి తనను ఎగతాళి చేశారని గౌడ చెప్పారు. గాడిద పాలు రుచికరమైనది, చాలా ఖరీదైనది. ఔషధ విలువలను కలిగి ఉంటాయి.
గాడిద పాలను ప్రజలకు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 30మి.లీ పాల ప్యాకెట్ రూ.150 ఉంటుందని.. మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం గాడిద పాలను విక్రయించాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు. 17 లక్షల విలువైన ఆర్డర్లు ఇప్పటికే వచ్చాయనిశ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..