Success Story: ఆత్మహత్య ఆలోచన నుంచి నేడు భారతదేశంలో అతిపిన్న వయసులో కార్పొరేట్ సీఈవోగా ఎదిగిన రాధిక..

నా కళ్ళలో ఒకటి మెల్లకన్ను, మెడ వంకర.. అయితే నేను నాకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని అది సాధించే దిశగా అడుగులు వేశాను.. మరి మీ ప్రత్యేకత ఏమిటి?'' అంటూ ఇప్పుడు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు రాధికా గుప్తా.. 

Success Story: ఆత్మహత్య ఆలోచన నుంచి నేడు భారతదేశంలో అతిపిన్న వయసులో కార్పొరేట్ సీఈవోగా ఎదిగిన రాధిక..
India S Youngest Ceo
Follow us

|

Updated on: Jun 07, 2022 | 1:03 PM

Success Story: దేవుడు చూసిన చిన్న చూపుతో వంకర టింకర మెడతో జన్మించింది ఓ యువతి.. దీనికి తోడు స్పష్టంగా మాట్లాడలేకపోయేది.. దీంతో స్టూడెంట్ గా అనేక వేధింపులకు, నిరాదరణకు గురైంది. తనకు ఎదురైనా ప్రతి అనుభాన్ని జీవితానికి పాఠంగా అన్వయించుకుని మంచి మార్కులతో కాలేజీ చదువును కంప్లీట్ చేసింది. అయితే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనూ టాలెంట్ ను కాకుండా.. శారీరక అందానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో.. అనేక ఉద్యోగావకాశాలు చేజారి పోయాయి. అయినప్పటికీ తన పట్టుదలను వదలలేదు.. అందరిలా నిరాశకు గురవ్వలేదు.. తనను అవమానించిన ప్రతిసారి రెట్టించిన పట్టుదలతో ప్రయత్నాలు చేసింది. ఓ కార్పొరేట్ సంస్థ ఆ యువతి ప్రతిభకు పట్టడం గట్టింది. దీంతో తనకు అందిం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 33 ఏళ్ల వయసులో భారత దేశంలో అతి పిన్న వయస్కురాలైన CEO గా చరిత్ర సృష్టించింది.. ఆ స్ఫూర్తివంతమైన మహిళ పేరు రాధికా గుప్తా.. హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో షేర్ చేసిన స్ఫూర్తిదాయకమైన మహిళ గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఎడెల్వీస్ MF  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధికా గుప్తా .. తాను వంకర మెడతో పుట్టడంతో ఎదుర్కొన్న ఇబ్బందులను హ్యూమన్‌స్ ఆఫ్ బాంబేలో వివరించారు.  రాధికా తండ్రి… దౌత్యవేత్త. దీంతో ఆమె భారతదేశం, పాకిస్తాన్,  న్యూయార్క్‌ వంటి దేశాలతో జీవించింది. ఈ నేపథ్యంలో తండ్రికి  నైజీరియాకు ట్రాన్ఫర్ అయింది. తనకు అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయిందని.. తన భారతీయ యాసను గుర్తించి.. ‘అపు’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. అపు అంటే ది సింప్సన్స్‌లోని ఒక పాత్ర,” అని గుప్తా తన మాజీ క్లాస్‌మేట్స్ ను గుర్తు చేసుకున్నారు.

తనను తల్లి అందంతో పోలుస్తూ ఉండేవారని.. దీంతో తాను ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు. మీ అమ్మతో పోలిస్తే.. నువ్వు చాలా అందవిహీనంగా ఉన్నావంటూ తరచుగా మాట్లాడేవారు.. దీంతో తనకు క్రమంగా విశ్వాసం క్షీణించిందని అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అయితే తన తల్లి ఒక “అద్భుతమైన మహిళ” అని గుప్తా చెప్పారు.

చదువు అయింది. ఇక ఉద్యోగాల వేట మొదలు పెట్టాను..  22 సంవత్సరాల వయస్సులో, ఆమె 7వ సారికూడా రిజెక్ట్ అయ్యారు. అప్పుడు తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మొదలయ్యాయని అప్పటి అనుభవాలను పంచుకున్నారు. తాను కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవలననుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.  వెంటనే రాధికా గుప్తా స్నేహితులు ఆమెను మానసిక చికిత్సా విభాగానికి తీసుకెళ్లారు.. అక్కడ ఆమె డిప్రెషన్‌తో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే తనకు ఇంటర్వ్యూ ఉందని.. ఇదే తన చివరి ప్రయత్నం చెప్పడంతో  వార్డునుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అనుమతిచ్చారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు మెకిన్సేలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఉద్యోగంలో అడుగు పెట్టిన  3 సంవత్సరాల తరువాత..  2008లో మార్పు కావాలనిపించి  25 సంవత్సరాల వయస్సులో తిరిగి భారత దేశానికి వచ్చారు.  భర్త , స్నేహితునితో కలిసి స్వంత ఆస్తి నిర్వహణ సంస్థను ప్రారంభించారు.

కొన్ని సంవత్సరాల తరువాత.. ఆ కంపెనీ Edelweiss MF కొనుగోలు చేసింది. దీంతో రాధికా కార్పొరేట్ రంగంలో అడుగు పెట్టారు. కార్పొరేట్ ఎంప్లాయిస్ అందరూ సూట్స్ ధరిస్తే.. రాధికా గుప్తా భారతీయ సంప్రాదయానికి ప్రతీకగా చీరను ధరించారు.  అయితే Edelweiss MF CEO కోసం ప్రకటన ఇచ్చిన సమయంలో తన భర్త ఎంతో ప్రోత్సహించారని.. అప్పుడు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. కొన్ని నెలల తర్వాత రాధికా గుప్తా Edelweiss MF సీఈవోగా ఎంపికయ్యారు. దీంతో రాధికా గుప్తా 33 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయసు గల సీఈవోల్లో ఒకరు అయ్యారు.

ఒక కార్యక్రమంలో మాట్లాడటానికి రాధికను ఆహ్వానించగా.. అక్కడ తన చిన్ననాటి అభద్రతాభావాలను, అనుభవాలను..  ఆత్మహత్యాయత్నాన్ని పంచుకున్నారు. మెడ విరిగిన అమ్మాయి నుంచి కార్పొరేట్ సంస్థకు సీఈవోగా తీరుని పదిమందికి తెలియజేశారు.

ఇప్పుడు రాధికా గుప్తా వయసు 39 ఏళ్ళు.. తన శారీరక లోపాలు తన అందాన్ని తక్కువ జేయలేవని గుర్తించారు. తన లోపాలను అంగీకరించి.. వాటిని అర్ధం చేసుకుని విజయంవైపుగా అడుగులు వేసినట్లు చెప్పారు. అవును..  నా కళ్ళలో ఒకటి మెల్లకన్ను, మెడ వంకర.. అయితే నేను నాకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని అది సాధించే దిశగా అడుగులు వేశాను.. మరి మీ ప్రత్యేకత ఏమిటి?” అంటూ ఇప్పుడు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు రాధికా గుప్తా..

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..