AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: కరోనా లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయింది.. ఉబెర్ బైక్ రైడర్‌గా మారి కుటుంబాన్ని పోషిస్తోన్న యువతి..

కోల్‌కతా మహిళ కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది. అయినప్పటికీ పట్టు వదలలేదు. మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉబెర్ బైక్‌ను నడపడం ప్రారంభించింది.

Inspiring Story: కరోనా లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయింది.. ఉబెర్ బైక్ రైడర్‌గా మారి కుటుంబాన్ని పోషిస్తోన్న యువతి..
Kolkata Woman
Surya Kala
|

Updated on: May 19, 2022 | 10:19 AM

Share

Inspiring Story: కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితం.. కోవిడ్ కు(Covid-19) ముందు.. తరువాత అని చెప్పుకోవాల్సి ఉంది. కోవిడ్-19 మహమ్మారి ఆర్ధికంగా, శారీరకంగా, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎందరో తమ ఉద్యోగాలు కోల్పోయారు. అవకాశాలు కోల్పోయారు.. దీంతో తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం  ఏదైనా చేయవలసి వచ్చింది. ఉద్యోగం కోల్పోయిన కొందరు తమ పట్టుదలతో తమకు అనుభంలేని.. పనులను చేపట్టి.. అందులో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు కోల్‌కతా మహిళ. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది. అయినప్పటికీ పట్టు వదలలేదు. మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉబెర్ బైక్‌ను నడపడం ప్రారంభించింది. కరోనా ఇచ్చిన గునపాఠం నుంచి ఆత్మవిశ్వాసం పెంచుకున్నానంటోంది కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు ఉబెర్‌ బైక్‌ రైడర్‌. ఈ విషయాన్ని రచయిత రణవీర్‌ భట్టాచార్య లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు.

మౌతుషి బసు కరోనా కంటే ముందు పానసోనిక్‌ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే కరోనాతో ఉద్యోగం కొల్పోయిన ఆమె.. కుటుంబ పోషణ కోసం ఉబెర్‌ డ్రైవర్‌ అవతారమెత్తింది. రణబీర్ భట్టాచార్య అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో మహిళ గురించి పోస్ట్ చేశాడు. మౌతుషితో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి… ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. “ఈ రోజు, నేను నగరం అంతటా త్వరితగతిన ప్రయాణించడానికి ఉబెర్‌మోటో అనే ద్విచక్ర వాహనాన్ని బుక్ చేసుకున్నాను. ఈ సమయంలో 30 ఏళ్ల ప్రారంభంలో మౌతుషి బసు అనే మహిళను కలిశాను. ఆమె కోల్‌కతా సమీపంలోని సబర్బన్ ప్రాంతమైన బరుయ్‌పూర్‌లో నివసిస్తోంది. ఆమెను ప్రశ్నిస్తే చెప్పిన విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, తాను పానసోనిక్‌లో ఉద్యోగం చేసేదానినని, కరోనా కారణంగా ఉద్యోగం పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఇలా రైడర్‌గా మారినట్టు చెప్పారని రణవీర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా వీధుల్లో ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఆమె బండిని చాలా జాగ్రత్తగా నడిపారన్న రణవీర్‌.. అందుకు అదనంగా డబ్బులు ఏమీ అడగలేదని తెలిపారు. గతంలో బండి నడిపిన అనుభవం ఉందా? అని ప్రశ్నిస్తే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదని బసు సమాధానం ఇచ్చారన్నారు. బసు కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను చదివిన తర్వాత ఆమె ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.  ప్రజలు ఆ మహిళను మాత్రమే కాకుండా రణబీర్‌ను కూడా ప్రశంసించారు. చాలా మంది ఆమె వివరాలను కూడా అడిగారు.. తాము ఆమెకు ఏ విధంగానైనా సహాయం చేయగలమా అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ పోస్ట్‌కి దాదాపు 2,000 లైక్‌లు, దాదాపు 500 మంది వినియోగదారులు వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..