Inspiring Story: 3 వేలతో మొదలై.. లక్షలు దాటిన బిజినెస్.. స్వయం ఉపాధితో రాణిస్తూ.. 19మందికి ఉపాధినిస్తున్న మహిళ
Inspiring Story: కష్టపడే తత్వం.. నేటి సమాజంలోని అవసరాలను గుర్తించి.. వాటిని అనుసరించి ఉపాధిని కల్పించుకునే ఆలోచనలు తెలివితేటలు ఉంటే చాలు.. చిన్న చిన్న బిజినెస్..
Inspiring Story: కష్టపడే తత్వం.. నేటి సమాజంలోని అవసరాలను గుర్తించి.. వాటిని అనుసరించి ఉపాధిని కల్పించుకునే ఆలోచనలు తెలివితేటలు ఉంటే చాలు.. చిన్న చిన్న బిజినెస్(Small Scale Business) లతోనే మంచి సక్సెస్ అందుకోవచ్చు. పదిమందికి ఆదర్శంగా నిలబడవచ్చు. ఓ మహిళ అతి తక్కువ పెట్టుబడితో చిన్న బిజినెస్ మొదలు పెట్టింది.. ఈరోజు ఏడాదికి లక్షల రూపాయలను లాభాలుగా ఆర్జిస్తోంది. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి ఆ మహిళ మొదలు పెట్టిన వ్యాపారం ఏమిటో తెలుసా.. సలాడ్ వ్యాపారం.. అవును ప్రస్తుతం ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా, ఆరోగ్యంగా ఉండాలనుకున్నా ఎక్కువగా సలాడ్లను తినే ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అయితే ఈ సలాడ్ ను తయారు చేసుకోవడానికి చాలామందికి సమయం దొరకడం లేదు. దీంతో పూణేకుకు చెందిన ఒక మహిళ సలాడ్ వ్యాపారం గురించి ఆలోచించింది. ఆచరణ లో పెట్టి.. ప్రస్తుతం సక్సెస్ బిజినెస్ మ్యాన్ గా ఖ్యాతిగాంచింది. వివరాల్లోకి వెళ్తే..
పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ ఉద్యోగి, మేఘనా బఫ్నా అనే మహిళ 3 సంవత్సరాల క్రితం 2017 లో సలాడ్ వ్యాపారం ప్రారంభించాలను కుంది. మూడు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టింది. తన సలాడ్ బిజినెస్ కు ప్రమోషన్స్ ను సోషల్ మీడియానే వేదికగా చేసుకుంది. దీంతో సోషల్ మీడియా ద్వారా సలాడ్స్ ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది. ఆమె ఆలోచన పలువురు నెటిజన్లను ఆకర్షించింది. కొన్ని రోజుల్లోనే సలాడ్ ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. మొదట్లో ఫ్రెండ్స్, ఇరుగు పొరుగువారి నుంచి ఆర్డర్లు వచ్చేవి. నెమ్మదిగా ఇతర సంస్థలనుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి.
ఏయే.3 వేలతో వ్యాపారం ప్రారంభం:
మేఘనా బఫ్నా తన సలాడ్ వ్యాపారాన్ని రూ. 3000లతో మొదలు పెట్టింది.. ఇప్పుడు ఏడాదికి రూ.15 లక్షలు సంపాదిస్తోంది. తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి..తాజా కూరగాయలను తెచ్చి నాణ్యమైన సలాడ్ ను తయారు చేస్తుంది. బఫ్నా బిజినెస్ ను ప్రారంభించిన కొత్తలో నష్టాలను ఎదుర్కొంది. అయినప్పటికీ వెరవకుండా బిజినెస్ చేయడంతో నేడు.. పూణే లో మంచి ఫేమస్ సంపాదించుకున్నారు. అంతేకాదు బిజినెస్ అంటేనే లాభనష్టాల రెండింటి కలయిక అంటారు. ఇప్పుడు ఆమె నెలకు రూ.75 వేల నుండి 1. 25 లక్ష రూపాయలను సంపాదిస్తోంది.
సోషల్ మీడియా సాయంగా ఆర్డర్లు:
సలాడ్లు అమ్మకానికి వాట్సాప్ ఉపయోగిస్తుంది. ఎవరైనా తనకు సలాడ్ ను ఆర్ధర్ ఇవ్వాలనుకుంటే.. వాట్సాప్‌లో ద్వారా ఇవ్వొచ్చు అని ప్రజలను ఆహ్వానిస్తోంది. తాను మరికొంతమందికి పని ఇచ్చే దిశగా ఎదుగుతాను అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది మేఘనా. ప్రస్తుతం 19 మందికి ఉపాధి కల్పిస్తోంది. కృషి, పట్టుదల ఉంటె సక్సెస్ మన సొంతం అని నిరూపిస్తోంది.