AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd Health Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తినండి చాలు.. సగం రోగాలు మాయమవుతాయి..!

పెరుగు(Curd) ఒంటికి ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో పెరుగు తినడం శరీరానికి మేలు చేస్తుంది. వేసవి(Summer)లో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది...

Curd Health Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తినండి చాలు.. సగం రోగాలు మాయమవుతాయి..!
Curd
Srinivas Chekkilla
|

Updated on: Apr 28, 2022 | 6:00 AM

Share

పెరుగు(Curd) ఒంటికి ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో పెరుగు తినడం శరీరానికి మేలు చేస్తుంది. వేసవి(Summer)లో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది. రెగ్యులర్‌ గా పెరుగును ఆహారంలోకి తీసుకోవడం వల్ల మెల్ల మెల్లగా కొవ్వు కరిగి పోయి బరువు తగ్గుతారు. పాలు(Milk) తాగడం కుదరని వారు దానికి ప్రత్యామ్నాయంగా పెరుగు తాగవచ్చు. అయితే పెరుగును రాత్రి పూట కాకుండా మిగతా సమయాల్లో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగును పలు ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అనేక రోగాలు నయమవుతాయట.. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండడంతో పాటు లాక్టోస్, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అధిక బరువుతో ఇబ్బంది పడే వారు పెరుగుతో జీలకర్ర కలిపి తింటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారట. జీలకర్రను వేడి చేసి.. ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టి పొడిగా మార్చి పెరుగుతో కలిపి తినాలి. పెరుగును చక్కెరతో కలిపి తినడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. వీటికి కలిపి తినడం వల్ల గొంతులోని కఫం సమస్య కూడా దూరమవుతుందట. శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉపవాస సమయంలో చాలా మంది రాక్ సాల్ట్‌తో కలిపిన పెరుగును తింటుంటారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుందట.

పెరుగు, వాము కలిపి తినడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి పోతుంది. దీంతో పాటు అల్సర్ సమస్య కూడా తగ్గుతుంది. పెరుగులో నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలిపి తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందట. మూడు చెంచాల పెరుగులో రెండు చెంచాల నల్ల మిరియాల పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకుని… ఆ మిశ్రమాన్ని జుట్టుకు పటించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారడం సహా జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందట.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!