- Telugu News Photo Gallery Apple Seeds For Health know can apple Seed kill you and know all facts about this and its Effect on your body
Apple Seeds: యాపిల్ గింజలు శరీరంపై విష ప్రభావం చూపుతాయా? వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!
యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ, యాపిల్ గింజలు శరీరానికి హానికరం అని ఎంత మందికి తెలుసు. ఒక వేళ తెలిసి.. చాలా మంది దీనిని విస్మరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ గింజలు నిజంగానే ఆరోగ్యానికి హానికరమా? అలా అయితే దాని నష్టాలు ఏంటి? యాపిల్ గింజలకు సంబంధించిన ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 27, 2022 | 10:06 PM

యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ, యాపిల్ గింజలు శరీరానికి హానికరం అని ఎంత మందికి తెలుసు. ఒక వేళ తెలిసి.. చాలా మంది దీనిని విస్మరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ గింజలు నిజంగానే ఆరోగ్యానికి హానికరమా? అలా అయితే దాని నష్టాలు ఏంటి? యాపిల్ గింజలకు సంబంధించిన ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రిటానికాలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఆపిల్ గింజలు ఆరోగ్యానికి తీవ్రమైన హానీ చేస్తాయట. ఒక్కోసారి అవి శరీరంలో విషంగా మారుతుందట. అయితే పరిమితంగా తీసుకుంటే నష్టం లేదని, ఎక్కువగా తింటే మాత్రం విషంలా పని చేస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.

ఆపిల్స్, బేరీ, చెర్రీస్ వంటి అదే జాతికి చెందిన ఇతర పండ్ల విత్తనాలలో సైనైడ్, చక్కెరతో కూడిన సైనోజెనిక్ గ్లైకోసైడ్ అయిన అమిగ్డాలిన్ ఉంటుంది. అది అతిగా తీసుకుంటే.. శరీరం జీర్ణించుకోలేదు. ఇదికాస్తా రసాయనంగా మారి విషపూరితమైన హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. ఈ హైడ్రోజన్ సైనైడ్ నిమిషాల్లోనే వ్యక్తి ప్రాణాలు తీస్తుంది.

అయితే, ఒక వ్యక్తి యాపిల్ తింటే చనిపోరు. ఇది విషంగా మారడానికి, శరీరానికి హాని కలిగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. విత్తనాన్ని నమలడం, చూర్ణం చేసినప్పుడు అమిగ్డాలిన్ పని చేస్తుంది. ఆపిల్ గింజలు విరగకపోతే సమస్య లేదు. అదే చూర్ణం అయితే సమస్య ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.