- Telugu News Photo Gallery Cinema photos Tollywood Six Celebrities You Probably Didn't Know Set Guinness Book of World Records
Tollywood: ఎల్లలు దాటిన తెలుగు ఖ్యాతి.. గిన్నిస్ బుక్ రికార్డ్స్ నెలకొల్పిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరంటే..
Tollywood: చాలామంది ఈ రికార్డ్‌లో ఎక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు మాత్రం ఎటువంటి రికార్డ్స్ పై దృష్టి పెట్టకుండా తమపని తాము చేసుకుంటూ వెళ్లి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తమకంటూ ఒక పేజీని సృష్టించుకున్నారు.
Updated on: Apr 27, 2022 | 8:35 PM

భారతీయ సినీ గాయనిగా తనదైన ముద్ర వేషుకున్నారు పి సుశీల. తనదైన ప్రత్యేక స్వరంతో అనేక పాటలకు ప్రాణం పోశారు.. సంగీత ప్రియులను అలరించారు. 1960ల నుండి ఆరు భారతీయ భాషల్లో 17,695 పాటలను పాడిన నేపధ్యగాయనిగా సినిమా సంగీత చరిత్రలో రికార్డ్ సృష్టించారు. 2016 సంవత్సరంలో పి. సుశీల గారు" గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు

తన అసమానమైన గాత్రంతో, దివంగత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం చిత్రాలతో సహా పలు భారతీయ భాషలలో సినిమాల్లో పాటలను పాడారు, భారతీయ సంగీత పరిశ్రమలో ప్రముఖ నేపథ్య గాయకుడిగా ఓ పేజీని లిఖించుకున్నారు. ఎస్పీబాలు వివిధ భాషలలో 40,000 పాటలను పాడి.. అత్యధిక సంఖ్యలో పాటలను పాడిన నేపధ్య గాయకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు

విజయ నిర్మల అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించారు. 1973లో మీనాతో దర్శకురాలిగా మారారు. 47 చిత్రాలను తీసిన మహిళా దర్శకురాలిగా 2002 సంవత్సరంలో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. డా. విజయ నిర్మల సుమారు రెండు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు, తమిళ , మలయాళం మొదలైన భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించారు. 15 చిత్రాలను నిర్మించారు.

దర్శక రత్న దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కెక్కారు. 151 చిత్రాలతో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా అందుకున్నారు.

లెజెండరీ ప్రొడ్యూసర్ డి రామా నాయుడు 130 చిత్రాలను నిర్మించారు. అత్యధిక సినిమాలను నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 2008 నాటికి 13 భారతీయ భాషల్లో 150కి పైగా చిత్రాలను నిర్మించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు డి రామానాయుడు . 1964లో రాముడు భీముడు చిత్రంతో తన రంగప్రవేశం చేసిన తర్వాత, రామానాయుడు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

తెలుగు నట హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒకే భాషలో (తెలుగు) అత్యధిక చిత్రాలలో నటించిన నటుడుగా రికార్డ్ సృష్టించారు. 1000కు పైగా సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేసుకున్నారు. తెలుగులో తనదైన కామిక్ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.




