Crypto Market Crash: కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు.. రూ. 25వేలకు దిగువన బిట్ కాయిన్.. ఎందుకంటే..

Cryptocurrency Prices Today: క్రిప్టో కరెన్సీ.. భారీ కుదుపునకు గురవుతోంది. వార్‌ ఎఫెక్ట్‌తో కిందామీదా పడుతోంది డిజిటల్‌ కరెన్సీ. స్టాక్ మార్కెట్లతో పాటు క్రిప్టోకరెన్సీ మార్కెట్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. విధాలుగా క్రిప్టో మార్కెట్ అధ్వాన్నమైన స్థితికి చేరుకుంది. గత వారంలో..

Crypto Market Crash: కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు.. రూ. 25వేలకు దిగువన బిట్ కాయిన్.. ఎందుకంటే..
Bitcoin
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 13, 2022 | 12:52 PM

వర్చువల్‌ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. అమాంతం పడిపోయిన క్రిప్టో కరెన్సీ.. భారీ కుదుపునకు గురవుతోంది. వార్‌ ఎఫెక్ట్‌తో కిందామీదా పడుతోంది డిజిటల్‌ కరెన్సీ. స్టాక్ మార్కెట్లతో పాటు క్రిప్టోకరెన్సీ మార్కెట్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. విధాలుగా క్రిప్టో మార్కెట్ అధ్వాన్నమైన స్థితికి చేరుకుంది. గత వారంలో మొదటి రోజు బిట్‌కాయిన్ 25 వేల డాలర్ల దిగువకు చేరుకుంది. అతిపెద్ద క్రిప్టోకరెన్సీ సోమవారం ఉదయం $25,745 వద్ద ట్రేడవుతోంది. గత 5 రోజుల్లో బిట్‌కాయిన్ దాదాపు 15 శాతం నష్టపోయింది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.50% కంటే ఎక్కువ క్షీణతను చూస్తోంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ నేడు $1.13 ట్రిలియన్లకు తగ్గింది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల పరిస్థితి కూడా చెడ్డది. రెండవ పెద్ద క్రిప్టో Ethereum పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. గత 5 రోజుల్లో ఈ కరెన్సీ దాదాపు 25 శాతం పడిపోయింది. ఇవాళ ఇది సుమారు $1345 వర్తకం చేస్తోంది. గత 24 గంటల్లో ఇది 6 శాతానికి పైగా పడిపోయింది.

కార్డానో $ 0.50 దిగువకు పడిపోయింది..

కార్డానో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కరెన్సీ ఈరోజు 0.50 శాతం దిగువకు పడిపోయింది. ఈ ఉదయం ఇది దాదాపు 6 శాతం తగ్గి $0.47కి చేరుకుంది. గత 5 రోజుల్లో ఇది 27 శాతానికి పైగా పడిపోయింది. కార్డానో సెప్టెంబర్-21లో $3కి చేరుకుంది. అంటే ఏడాది వ్యవధిలో దీని ధర 6 సార్లు తగ్గింది. అంటే లక్ష రూపాయల పెట్టుబడి ఏడాదిలో 20 వేల రూపాయల లోపే అయింది.

Dogecoin ఒక సంవత్సరంలో 80 శాతం కంటే పైకి..

ప్రముఖ కరెన్సీ Dogecoin గత 5 రోజుల్లో 23 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. ఇవాళ Dogecoin $ 0.061కి 5 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. వార్షిక ప్రాతిపదికన Dogecoin దాదాపు క్రాష్ అయింది. ఏడాదిలో 80 శాతానికి పైగా పడిపోయింది.

బిట్‌కాయిన్ నుంచి ఈథర్, సోలానా వరకు 50 శాతం తగ్గుదల , అన్నీ ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయి లేదా దానికి దగ్గరగా వచ్చాయి. 100 అతిపెద్ద క్రిప్టోకరెన్సీల పనితీరును ట్రాక్ చేసే MVIS క్రిప్టోకంపేర్ డిజిటల్ అసెట్స్ 100 ఇండెక్స్ ఈరోజు 7 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. ఈ ఏడాది దాదాపు 50 శాతం క్షీణత చూపుతోంది.