Indian Railways Update: రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేడు 143 రైళ్ల రద్దు.. జాబితాను చెక్ చేసుకోండిలా..
Indian Railways Update: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. కానీ దేశంలో పలు రైళ్లను రద్దు చేసింది భారత రైల్వేశాఖ. కొన్నిసార్లు వివిధ కారణాల ..
Indian Railways Update: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. కానీ దేశంలో పలు రైళ్లను రద్దు చేసింది భారత రైల్వేశాఖ. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల రైళ్లను రద్దు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రైళ్లను దారి మళ్లించడం, రైలు జాబితాను రీషెడ్యూల్ చేయడం, రైలు జాబితా రద్దు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు శాంతిభద్రతలు సరిగా లేకపోవడం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాలలో అనేక సార్లు తుఫాను లాంటి పరిస్థితుల్లో పలు రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. ఇది కాకుండా కొన్నిసార్లు రైల్వే ట్రాక్‌ల మరమ్మతుల కోసం కూడా రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లు రైలు పట్టాల గుండా వెళుతున్నాయి. అందువల్ల వాటి నిర్వహణ ఎంతో ముఖ్యం. దీంతో రైళ్లను రద్దు చేయడమో లేదా దారి మళ్లించడమో చేయాల్సి వస్తోంది.
దేశంలో మొత్తం 143 రైళ్లు రద్దు చేయగా, 12 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. జూన్ 13న ఈ రైళ్లను పూర్తిగా రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. అదే సమయంలో మొత్తం 12 రైళ్ల షెడ్యూల్‌ను మార్చారు. రీషెడ్యూల్ చేయబడిన 12 రైళ్ల నంబర్లు – 02563, 03191, 03298, 04133, 11085, 13054, 14523, 17650, 19166, 20821, 237638 ఉన్నాయి. ఇక రైలు నంబర్‌లు 04444, 04444, 04444, 04444, 14646, 14646, 14646, 14646, 14888, 14888, 19226, 19226 రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేసిన రైళ్ల జాబితాను ఎలా చూడాలి:
రద్దు చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయడానికి, ముందుగా వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ ట్రైన్ నంబర్, పేరును ఎంచుకోండి. రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన, దారి మళ్లించిన రైళ్ల జాబితాపై క్లిక్ చేయండి. ఇలా తనిఖీ చేసుకున్న తర్వాతే ప్రయాణం కోసం వెళ్లండి. సమాచారం తెలుసుకోకుండా స్టేషన్‌కు వెళితే ఇబ్బందులకు గురవుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి