AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payment Fraud: ఆ పేరుతో కాల్స్ వస్తున్నాయా.. ఈ 5 టిప్స్ పాటిస్తే.. ఆన్‌లైన్ మోసాల నుంచి ఈజీగా బయటపడొచ్చు..

ఎవరైనా మీ బ్యాంక్ ఖాతాను KYC పేరుతో మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌కు యాక్సెస్ తీసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ మోసం చేయడానికి ఇది కూడా కొత్త మార్గం.

UPI Payment Fraud: ఆ పేరుతో కాల్స్ వస్తున్నాయా.. ఈ 5 టిప్స్ పాటిస్తే.. ఆన్‌లైన్ మోసాల నుంచి ఈజీగా బయటపడొచ్చు..
Upi
Venkata Chari
|

Updated on: Jun 12, 2022 | 10:31 AM

Share

UPI Payment Fraud: ఓ వైపు ఆన్‌లైన్ చెల్లింపు నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తే, మరోవైపు ఆన్‌లైన్ మోసాల సంఘటనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. UPI చెల్లింపుల్లో మోసం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారింది. అయితే, ఆన్‌లైన్ UPI చెల్లింపులు చేసేటప్పుడు మనం కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే, మోసాలను నివారించవచ్చు. UPI చెల్లింపులను సురక్షితంగా పూర్తి చేసేందుకు ఈ 5 చిట్కాలను తెలుసుకుందాం..

UPI పిన్‌ను భాగస్వామ్యం చేయవద్దు..

మీ UPI, యూపీఐ పిన్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంకులు లేదా మరే ఇతర ప్రభుత్వ సంస్థ మిమ్మల్ని UPI పిన్‌ను ఎప్పటికీ అడగవు. KYC లేదా మీ ఖాతా అప్‌డేషన్ పేరుతో మోసగాళ్లు మీ UPI పిన్‌ను కోరుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఆ ఫోన్ కాల్స్ లేదా సందేశాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు యాక్సెస్ ఇవ్వవద్దు..

మీరు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు కస్టమర్ కేర్ సెంటర్‌కు యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ బ్యాంక్ ఖాతాను KYC పేరుతో మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌కు యాక్సెస్ తీసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ మోసం చేయడానికి ఇది కూడా కొత్త మార్గం.

నకిలీ సైట్‌లను వాడొద్దు..

రివార్డ్‌లు లేదా డబ్బు మొదలైన వాటితో మిమ్మల్ని ఆకర్షించే వెబ్‌సైట్‌లలో లావాదేవీలు చేయవద్దు. ఇక్కడ యూపీఐ లావాదేవీ ద్వారా కేవలం రూ. 1 లావాదేవీ మాత్రమే చేయాలనే సందేశం రావడం చాలాసార్లు కనిపిస్తుంది. ఇక్కడ వారు మీ నుంచి రు 1 తీసుకుని, మీకు 2 రూపాయలను తిరిగి పంపుతారు. దాని ద్వారా మీ UPI పిన్ పొందడానికి ప్రయత్నిస్తుంటారు.

UPI పిన్‌ని మారుస్తూ ఉండండి..

మోసగాళ్లు మీ పిన్‌ను కలిగి ఉంటే, వారు వెంటనే ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏదైనా లావాదేవీని ప్రారంభించే ముందు UPI సరైన ఖాతాదారునికి లింక్ చేశారో లేదో తెలుసుకోవాలి. మీరు ప్రతి నెలా మీ UPI పిన్‌ని మారుస్తూ ఉండాలి. మీరు ప్రతి నెలా మార్చలేకపోతే, ప్రతి త్రైమాసికంలో ఒకసారి UPI పిన్‌ని మార్చుకోవడం మంచింది.

UPI పరిమితిని సెట్ చేసుకోవాలి..

UPI లావాదేవీల కోసం రోజువారీ పరిమితిని సెట్ చేయడం ద్వారా UPI మోసాన్ని కూడా నివారించవచ్చు. అంటే, మీరు వేయి రూపాయాల పరిమితిని సెట్ చేస్తే, ఒక రోజులో మీరు UPI ద్వారా ఎక్కువ షాపింగ్ లేదా నిధుల బదిలీ చేయలేరు. దీంతో మోసం జరిగినా పెద్దగా నష్టపోకుండా ఉండొచ్చు.