Petrol Prices: దేశంలో మళ్లీ పెరగనున్న చమురు ధరలు.. రోజు రేట్ల వివరాల కోసం ఇలా ఎస్ఎమ్ఎస్ చేయండి..
Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, భారత మార్కెట్లో వాహన ఇంధన ధరలపై కొంత ఉపశమనం కొనసాగుతోంది. మూడు వారాలుగా జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, భారత మార్కెట్లో వాహన ఇంధన ధరలపై కొంత ఉపశమనం కొనసాగుతోంది. మూడు వారాలుగా జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పుడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 121.28 డాలర్లకు పెరిగింది. ఇది 2012 నుంచి అంటే 10 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఉంది. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించి వాహనదారులకు ఉపశమనం కల్పించే ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్రాలు మాత్రం వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందిచలేదు. ఆ తర్వాత జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. అయితే చమురు కంపెనీలపై భారం మాత్రం పెరిగింది. ఇదిలా ఉండగా ముడిచమురు ధర పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ ఖరీదవుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండియన్ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62గా ఉంది.
విశేషమేమిటంటే.. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర రూ. 9.50, డీజిల్‌పై రూ. 7 తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్‌ని తగ్గించాయి. ఇందులో రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో పెట్రోల్ ఉత్పత్తులపై విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. మీరు మీ ఫోన్ నుంచి SMS ద్వారా ప్రతిరోజూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. IOCL వినియోగదారులకు RSP లభిస్తుంది. కోడ్ రాసి 9224992249 నంబర్‌కు పంపండి. మీ నగరం యొక్క RSP కోడ్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.