Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: డ్రగ్ రిటైల్ దిగ్గజాన్ని చేజిక్కించుకోనున్న అంబానీ.. ఆ కారణంగా పోటీ నుంచి తప్పుకున్న ఇస్సా బ్రదర్స్..

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ చాలా కాలంగా బ్రిటన్‌లో భారీ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాడు.

Mukesh Ambani: డ్రగ్ రిటైల్ దిగ్గజాన్ని చేజిక్కించుకోనున్న అంబానీ.. ఆ కారణంగా పోటీ నుంచి తప్పుకున్న ఇస్సా బ్రదర్స్..
Mukesh Ambani
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 12, 2022 | 11:15 AM

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ చాలా కాలంగా బ్రిటన్‌లో భారీ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాడు. ఇది ఇప్పటివరకు విదేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసుకున్న అతిపెద్ద డీల్ నిలువనుంది. చాలా కాలంగా వాల్‌గ్రీన్స్ డ్రగ్ రిటైలర్ బ్రాండ్ బూట్‌లను కొనుగోలు చేయడానికి అందానీ నేతృత్వంలోని రిలయన్స్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్, కొనుగోలు సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఇంక్ నివేదించింది. ఇందుకోసం బైండింగ్ ఆఫర్‌ను పూర్తిచేసుకున్నాయి. ఈ డీల్ పూర్తయితే.. ఇప్పటి వరకు రిలయన్స్‌కి ఇది అతిపెద్ద విదేశీ ఒప్పందం కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ రిటైలర్ కంపెనీల్లో బూట్స్ ఒకటిగా ఉంది.

ముఖేష్ అంబానీ ఈ ఒప్పందానికి మార్గాన్ని బ్రిటిష్-గుజరాతీ సోదరులు ఇస్సా బ్రదర్స్ కూడా నిలిపివేశారు. నిజానికి బూట్‌ కోసం మొదటి రౌండ్ బిడ్డింగ్‌లో, అతిపెద్ద బిడ్‌ను Issa Bros సమర్పించింది. దేశంలోని బరూచ్‌కు చెందిన మొహ్సిన్ ఇస్సా, జుబెర్ ఇస్సా తమ యూరో గ్యారేజెస్ కంపెనీ ద్వారా ఈ డీల్‌కు బిడ్ చేశారు. ఇది ఐరోపాలోని అతిపెద్ద పెట్రోల్ పంపు కంపెనీల్లో ఒకటి. దీనితో పాటు.. ఈ సోదరులకు బ్రిటిష్ సూపర్ మార్కెట్ చైన్ కంపెనీ అస్డా, రెస్టారెంట్ చైన్ కంపెనీ లియోన్ కూడా ఉన్నాయి. సోదరులిద్దరూ TDR క్యాపిటల్‌తో కలిసి ఈ కొనుగోలు కోసం వేలం వేశారు. కానీ.. ఇప్పుడు వారు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే వాల్‌గ్రీన్స్ విలువ ఎక్కువగా ఉందని వారు భావిస్తున్నారు. ఇంతలో.. బ్రిటన్‌లో అప్పులు ఖరీదైనవిగా మారాయి. ఈ కారణంగా ఈ ఒప్పందం కోసం రుణాలు సేకరించడం వారికి కష్టంగా మారిందని తెలుస్తోంది.

మొదట వాల్‌గ్రీన్స్ బూట్‌లను విక్రయించడానికి 7 బిలియన్ పౌండ్ల విలువ.. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 67,372 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు ఇస్సా బ్రదర్స్ పేరు ఉపసంహరించుకోవడంతో రిలయన్స్, అపోలో కన్సార్టియం మాత్రమే కొనుగోలు పోటీలో నిలిచాయి. UKలో బూట్స్‌కి 2,200 స్టోర్‌లు ఉన్నాయి. కంపెనీ NO -7 బ్యూటీ వంటి ప్రైవేట్ లేబుల్ బ్రాండ్‌ను కూడా కలిగి ఉంది. అదే సమయంలో కంపెనీ ఐరోపాలోని ఇతర దేశాలో పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది మార్చిలో కంపెనీ తన అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ ద్వారా US ఆధారిత లిథియం వర్క్స్‌ను సుమారు 60 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ కంపెనీ లిథియం బ్యాటరీ టెక్నాలజీతో అనుబంధం కలిగి ఉంది. అయితే దీనికి ముందు.. రిలయన్స్ UK కు చెందిన 262 ఏళ్ల నాటి బొమ్మల తయారీ కంపెనీ హామ్లీస్‌ను కూడా కొనుగోలు చేసింది.