Kolleru lake: దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు.. కానీ, నేడు పక్షులకు అది ప్రాణసంకటం
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు ఎడారిని తలపిస్తోంది. నీటి కొరతతో మత్స్య సంపద మాయమవుతోంది. కొల్లేరులో వలస పక్షలకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. మండుతున్న ఎండలకు నీరు ఆవిరి అవుతుండటంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం 286 ఎకరాల ల్లో నీరు లేక విదేశీ పక్షులు, చేపలు చనిపోతున్నాయి. ఈ పక్షుల కేంద్రంలో 186 రకాల జాతుల పక్షులు విడిది చేస్తుంటాయి. 90 రకాల విదేశీ పక్షులు ప్రతియేటా […]
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు ఎడారిని తలపిస్తోంది. నీటి కొరతతో మత్స్య సంపద మాయమవుతోంది. కొల్లేరులో వలస పక్షలకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. మండుతున్న ఎండలకు నీరు ఆవిరి అవుతుండటంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం 286 ఎకరాల ల్లో నీరు లేక విదేశీ పక్షులు, చేపలు చనిపోతున్నాయి. ఈ పక్షుల కేంద్రంలో 186 రకాల జాతుల పక్షులు విడిది చేస్తుంటాయి. 90 రకాల విదేశీ పక్షులు ప్రతియేటా మార్చి నుండి అక్టోబర్ వరకు ఆటపాక పక్షుల కేంద్రంలో ఉండి సంతానోత్పత్తి చేసుకొని తమ పిల్లలను తీసుకొని విదేశాలకు వెళ్తుంటాయి.
ఆటపాక పక్షుల కేంద్రంలో అర అడుగు కూడా నీరు లేక ఇంకిపోవడంతో పక్షుల మనుగడ కష్టంగా మారింది. అధిక ఎండలకు నీరు బాగా వేడెక్కి పోవడంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి .పక్షులకు తిండిలేక ఆకలితో అలమటించి చనిపోతున్నాయి. పక్షుల కేంద్రంలో నీరు తక్కువగా ఉండడంతో బోట్ షికారు సైతం నిలిచిపోయింది. వేసవి రాకముందే పక్షుల కేంద్రమైన 286 ఎకరాల చెరువును నీటితో నింపి నీరు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
వేసవిలో ఎక్కువగా వచ్చే పర్యాటకులకు బోటు షికారు ఏర్పాటుచేయ వలసిన సమయములో చెరువులు ఎండగట్టడంలొ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి తెలుస్తుందని పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో పర్యాటక రంగానికి వచ్చే ఆదాయానికి ఫారెస్ట్ వారే గండి కొడుతున్నారని పర్యావరణ ప్రేమికులు ఆరోపించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి