CM Jagan: చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోడు దొంగల్లా మారారు.. రైతులు, విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారు..
CM Jagan: కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ రైతుల్ని రెచ్చగొడుతున్నారన్నారు. టెన్త్ విద్యార్థులతోనూ రాజకీయం చేస్తున్నారని, కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోడు దొంగల్లా మారారని విమర్శించారు సీఎం జగన్. ప్రభుత్వం చేస్తున్న మంచిని డైవర్ట్ చేయడానికి ఎన్నెన్నో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటాడని సీఎం జగన్ విమర్శించారు. మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలన్నారు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ రైతుల్ని రెచ్చగొడుతున్నారన్నారు. ఎవరైనా రైతన్న చనిపోతే ఆదుకుంటున్నాం.. పరిహారం అందని ఒక్క కౌలు రైతునైనా చంద్రబాబు, దత్తపుత్రుడు చూపించలేకపోయారు.. నేను సవాల్ చేసిన.. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు స్పందించలేక పోయారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు దత్తపుత్రుడికి గుర్తురాలేదు, ఇవ్వాలనే తపన చంద్రబాబుకు లేదన్నారు.
టెన్త్ విద్యార్థులతోనూ రాజకీయం చేస్తున్నారని..ఏపీ టెన్త్‌లో 67 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.. అయితే గుజరాత్‌లో 65 శాతమే పాస్ అయ్యారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడాలి. టెన్త్ విద్యార్థులను సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సప్లిమెంటరీలో పాస్ అయిన రెగ్యులర్‌గానే పరిగణిస్తామని సీఎం జగన్ ధర్యం చెప్పారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేశారని మండిపడ్డారు. ఆఖరికి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని, ఎంత మంది ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎదుర్కోగలనని స్పష్టం చేశారు సీఎం జగన్. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా కింద సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి.
దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. ఆర్బీకేలు రైతన్నను పట్టుకొని నడిపిస్తున్నాయి. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 25,800 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రూ.8750 కోట్లు పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను తీర్చాం. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్ అన్నారు.