Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strawberry Supermoon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న స్ట్రాబెరీ మూన్‌..

ఈ రోజు పౌర్ణమి. ఇది మామూలు పౌర్ణమి అయ్యుంటే లైట్‌ తీసుకునే వాళ్లమే. కాని ఇది వేరు. మునుపెన్నడూ లేనంతగా చంద్రుడు ఈరోజు అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీన్నే స్ట్రాబెరీ మూన్‌ అంటున్నారు. ఇక్కడే ఓ మెలిక ఉంది.

Strawberry Supermoon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న స్ట్రాబెరీ మూన్‌..
Strawberry Moon
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 14, 2022 | 5:29 PM

ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పౌర్ణమి చంద్రుడు విభిన్న రూపంలో కనిపించబోతున్నాడు. స్ట్రాబెర్రీ మూన్‌గా కనిపించబోతున్నాడు చంద్రుడు. అంటే చంద్రుడు భూమికి అతి సమీపంగా రాబోతున్నాడు. దీంతో అత్యంత పెద్దగా.. ప్రకాశవంతంగా కనిపించబోతోంది చందమామ. ఈరోజు చంద్రుడు భూమి చుట్టూ కక్ష్యలోని సమీప బిందువులో ఉంటాడు.. దీనిని పెరిజీ అని పిలుస్తారు. ఇది సూపర్‌మూన్ లాగా కనిపిస్తుంది. ఈ సూపర్‌మూన్ భూమిపై ఉన్న వ్యక్తులకు చాలా ప్రకాశవంతంగా.. పెద్దదిగా కనిపిస్తుంది. ఆకాశం స్పష్టంగా ఉంటే ఈ రాత్రికి అందమైన దృశ్యాన్ని చూడగలరు. మరికాసేపట్లోనే.. అంటే జూన్ 14 సాయంత్రం 5గంటల 22 నిమిషాలకు.. చంద్రుడు గరిష్ట స్థాయికి చేరుకుంటాడు. ఈ సమయంలో మీరు ప్రకాశవంతమైన చంద్రుని అత్యాశ రూపాన్ని చూడవచ్చు.

స్ట్రాబెర్రీ మూన్ అనగానే.. స్ట్రాబెర్రీ రంగులోనో లేదా పింక్ రంగులోనో క‌నిపించ‌డం కాదు. ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం.. ఇది స్ట్రాబెర్రీ పికింగ్ సీజన్ కావడంతో.. దీన్ని స్ట్రాబెరీ మూన్‌గా పిలుస్తున్నారు. స్ట్రాబెర్రీ చంద్రుడిని రోజ్ మూన్, హాట్ మూన్, హనీ మూన్, మిడ్ మూన్ అని కూడా అంటుంటారు. తేనె కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వస్తుంది కాబట్టి దీనిని హనీ మూన్ అంటున్నారు.

‘స్ట్రాబెర్రీ మూన్’ అంటే ఏంటి?

ఇవి కూడా చదవండి

‘స్ట్రాబెర్రీ మూన్’ పేరుతో చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని మీరు ఊహించినట్లయితే.. అది తప్పు. ఈ రోజున, చంద్రుడు స్ట్రాబెర్రీస్ లాగా లేదా గులాబీ రంగులో కూడా కనిపించడు. స్థానిక అమెరికన్లు పౌర్ణమికి ఈ పేరు పెట్టారు. ది ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం.. స్ట్రాబెర్రీ మూన్ అనే పేరును మొదట అల్గోన్‌క్విన్, ఓజిబ్వే, డకోటా.. లకోటా ప్రజలు ఉపయోగించారు. ఎందుకంటే జూన్‌లో స్ట్రాబెర్రీలను పండించినప్పుడు పౌర్ణమిని ‘స్ట్రాబెర్రీ మూన్’ అని పిలుస్తారు.

ఏం  చేయాలి..

సనాత ధర్మం ప్రకారం, జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ఈరోజు జూన్ 14, 2022. ఈరోజు వటపూర్ణిమ. ఈ రోజున, వివాహిత స్త్రీలు పదహారు ఆభరణాలు ధరించి, మర్రి చెట్టును పూజిస్తారు. చెట్లను పూజించే సంప్రదాయం మన దేశంలో ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. వట్ సావిత్రి పూర్ణిమ రోజున వట వృక్షానికి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. మతపరమైన పురాణాల ప్రకారం.. సావిత్రి తన భర్త సత్యవాన్‌ను తిరిగి తీసుకురావడానికి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తీవ్రమైన తపస్సు చేసింది.