Xiaomi: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన షావోమీ.. తక్కువ ధరలో బ్యాటరీ రీప్లేస్ చేసుకునే అవకాశం..
Xiaomi: స్మార్ట్ ఫోన్‌లలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో బ్యాటరీ ప్రధానమైంది. కొన్ని రోజులు వాడగానే బ్యాటరీ సమస్యలు వస్తుంటాయి. అయితే కంపెనీ బ్యాటరీ దొరకడం అంత సులభమైన..
Xiaomi: స్మార్ట్ ఫోన్‌లలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో బ్యాటరీ ప్రధానమైంది. కొన్ని రోజులు వాడగానే బ్యాటరీ సమస్యలు వస్తుంటాయి. అయితే కంపెనీ బ్యాటరీ దొరకడం అంత సులభమైన విషయం కాదు. మరీ ముఖ్యంగా షావోమీ బ్రాండ్‌కు చెందిన రెండ్, ఎంఐ ఫోన్లలో కొన్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఫోన్‌లలో బ్యాటరీలను అంత సులభంగా మార్చలేము. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికే షావోమీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రూ. 499 నుంచే కొత్త బ్యాటరీని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో తెలుపుతూ అధికారికంగా ట్వీట్ చేసింది షావోమీ యాజమాన్యం. బ్యాటరీని మార్చుకోవడానికి దగ్గరల్లో ఉన్న షావోమీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని కంపెనీ సూచించింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. షావోమీ సర్వీస్+ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీ స్మార్ట్ ఫోన్ వివరాలను ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నేరుగా సర్వీస్ సెంటర్‌కు వెళితే క్షణాల్లో బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు.
బ్యాటరీల ప్రారంభ ధర రూ. 499గా ఉంటుందని తెలిపినప్పటికీ ఫోన్ మోడల్ బట్టి ధర మారుతుంటుంది. ఇదిలా ఉంటే ఇతర కంపెనీలకు చెందిన బ్యాటరీలను ఉపయోగించడం వల్ల ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో షావోమీ వినియోగదారుల అవసరాల దృష్ట్యా ఈ సరికొత్త ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.
It’s time to say goodbye to your battery problems!
Head to #Xiaomi Authorised Service Center near you and get your old battery replaced; get a refreshed & recharged experience ?
All of this, starting from just Rs 499https://t.co/UYgBXdBAqL#XiaomiCares #NoMiWithoutYou pic.twitter.com/QSsMWoavdF
— Muralikrishnan B (@hawkeye) June 13, 2022
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..