YouTube First Video: యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన మొట్ట మొదటి వీడియో ఇదే.. దీన్ని ఎప్పుడైనా చూశారా?

Viral Video: యూట్యూబ్‌ ఈపేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆరేళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలివాడి వరకు ప్రతీ ఒక్కరూ యూట్యూబ్‌కు అతుక్కుపోతున్నారు...

YouTube First Video: యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన మొట్ట మొదటి వీడియో ఇదే.. దీన్ని ఎప్పుడైనా చూశారా?
Follow us

|

Updated on: Jun 14, 2022 | 5:51 PM

Viral Video: యూట్యూబ్‌ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆరేళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలివాడి వరకు ప్రతీ ఒక్కరూ యూట్యూబ్‌కు అతుక్కుపోతున్నారు. వంటకాల నుంచి మొదలు బైక్‌ రిపేర్‌ వరకు అన్నింటినీ యూట్యూబ్‌లో చూసి చేసేస్తున్నారు. ఇక యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న క్రియేటర్లు ఎంతో మంది ఉన్నారు. ఇంతలా నెటిజన్లు ఆకట్టుకుంటున్న యూట్యూబ్‌ ప్రారంభమై ఇప్పటికి 17 ఏళ్లు గడుస్తోంది. యూబ్యూట్‌ను అధికారికంగా 2005లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏప్రిల్‌ 24, 2005లో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం కొన్ని వేల కోట్ల వీడియోలతో నిండిపోయిన యూట్యూబ్‌లో మొట్టమొదటిసారి అప్‌లోడ్‌ అయిన వీడియో ఏంటని ఎప్పుడని ఆలోచించారా.? ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. యూట్యూబ్‌ ఇండియా ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావెద్‌ కరీం ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఓ జూ వద్ద చిత్రీకరించిన వీడియోనే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన తొలి వీడియోగా చెబుతుంటారు. కాలిఫోర్నియాలోని ఓ జూ వద్ద ఈ వీడియోను చిత్రీకరించారు. ఏప్రిల్‌ 24, 2005లో అప్‌లోడ్ చేసినట్లు చూపిస్తున్న ఈ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 235,316,073 మంది వీక్షించారు. మరి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన ఆ తొలి వీడియో ఏంటో మీరూ చూసేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు