WPI Inflation: రికార్డు స్థాయిలో పెరిగిన WPI ద్రవ్యోల్బణం.. మే నెల కంటే ఎంత పెరిగిందంటే..

WPI Inflation: ఆహార పదార్థాలు, ముడి చమురు ధరలు పెరగడంతో మే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి చేరుకుంది. ఇది గడచిన నెల కంటే మరింత పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

WPI Inflation: రికార్డు స్థాయిలో పెరిగిన WPI ద్రవ్యోల్బణం.. మే నెల కంటే ఎంత పెరిగిందంటే..
Inflation
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 14, 2022 | 4:44 PM

WPI Inflation: ఆహార పదార్థాలు, ముడి చమురు ధరలు పెరగడంతో మే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి చేరుకుంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 15.08 శాతం ఉండగా.. అది గతేడాది మేలో 13.11 శాతంగా నమోదైంది. మే 2022లో అధిక ద్రవ్యోల్బణం రేటు ప్రధానంగా మినరల్ ఆయిల్స్, ముడి పెట్రోలియం & సహజ వాయువు, ఆహార వస్తువులు, లోహాలు, ఆహారేతర వస్తువులు, రసాయనాలు & రసాయన ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు మొదలైన వాటి ధరల పెరుగుదల ప్రధాన కారణంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

గత ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా 14వ నెలలో WPI ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో కొనసాగుతోంది. వరుసగా మూడు నెలల పాటు పెరుగుదలను కొనసాగిస్తోంది. కూరగాయలు, గోధుమలు, పండ్లు, బంగాళదుంపల ధరలు గత ఏడాది కాలంతో పోలిస్తే భారీగా పెరగడంతో మే నెలలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 12.34 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరల పెరుగుదల రేటు 56.36 శాతం, గోధుమలు 10.55 శాతం ఉండగా.. గుడ్లు, మాంసం, చేపల ధరల్లో పెరుగుదల రేటు 7.78 శాతంగా ఉంది.

ఇంధనం, పవర్ బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం 40.62 శాతంగా ఉండగా.. తయారీ ఉత్పత్తులు, నూనె గింజల్లో ఇది వరుసగా 10.11 శాతం, 7.08 శాతంగా ఉంది. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా ఉంది. ఇది వరుసగా ఐదవ నెలలో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం లక్ష్యమైన 6 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ క్రమంలో.. మొండిగా అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత రిజర్వు బ్యాంక్ తన కీలక వడ్డీ రేటును గత నెలలో 40 బేసిస్ పాయింట్లు, ఈ నెలలో 50 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ 2022-23 ద్రవ్యోల్బణం అంచనాను 100 బేసిస్ పాయింట్లు పెంచి 6.7 శాతాని తీసుకెళ్లింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక అంతర్జాతీయ కారణాల వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. దీనిని అదుపులోకి తెచ్చేందుకు రానున్న కాలంలో సైతం మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని రిజర్వు బ్యాంక్ ఇప్పటికే.. చెప్పకనే చెప్పింది.

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!