Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మదుపరులకు ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం భయాలు..
Markets Closing Bell: అమెరికా ద్రవ్యోల్బణం వివరాలు వెలువడిన నాటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లు గ్యాప్ డౌన్ లోనే ప్రారంభమయ్యాయి.

Markets Closing Bell: అమెరికా ద్రవ్యోల్బణం వివరాలు వెలువడిన నాటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లు గ్యాప్ డౌన్ లోనే ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 15,750 స్థాయికి దిగువన స్థిరపడటంతో.. భారత మార్కెట్లు వరుసగా మూడవ సెషన్ లోనూ నష్టాల్లోనే ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఈరోజు ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్‌ల వల్ల నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లను ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు కిందకు లాగుతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న వారాల్లో ఫెడ్ తన వడ్డీ రేట్లను భారీగా పెంచనున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో మార్కెట్లు సైతం దానికి అనుగుణంగానే స్పందిస్తున్నాయి.
మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 153 పాయింట్లు లేదా 0.29 శాతం పడిపోయి 52,693 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ-50 సూచీ ఇదే సమయంలో 42 పాయింట్లు లేదా 0.27 శాతం క్షీణించి 15,732 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ సూచీలో ఎన్టీపీసీ 1.68%, భారతీ ఎయిర్ టెల్ 1.60%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.49%, అదానీ పోర్ట్స్ 1.36%, అల్ట్రాటెక్ 1.35%, గ్రాసిమ్ 1.30%, ఇన్ఫోసిస్ 1.13%, సిప్లా 1.04%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 1.03%, ఎల్అండ్ టీ 0.82% మేర నష్టపోయి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో హెచ్పీసీఎల్ 5.66%, బజాజ్ ఆటో 5.14%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.23%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.95%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.46%, ఓఎన్జీసీ 2.26%, హిందాల్కో 2.22%, టెక్ మహీంద్రా 2.07%, జీ ఎంటర్ ప్రైజెస్ 1.65%, హీరో మోటొకార్ప్ 1.59% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.



