AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: పెరుగుతున్న కాలేయ వ్యాధులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కూడా కాలేయంపై ప్రభావం చూపుతుంది. తరచూ ఉండే కొన్ని అలవాట్లు కాలేయానికి హాని కలిగించవచ్చు.

Liver Health: పెరుగుతున్న కాలేయ వ్యాధులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..
Liver Failure
Shaik Madar Saheb
|

Updated on: Jun 14, 2022 | 6:27 PM

Share

Food Habits For Healthy Liver: కాలేయం (లివర్) మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. రక్తంలో ఉండే రసాయన స్థాయిని కాలేయం నిర్వహిస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కాలేయం నిరంతరం పనిచేస్తుంది. కాలేయం మన శరీరంలో అతి పెద్ద అవయవం. కాలేయం పనిచేయకపోతే అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే, కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తెలిసి, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కూడా కాలేయంపై ప్రభావం చూపుతుంది. తరచూ ఉండే కొన్ని అలవాట్లు కాలేయానికి హాని కలిగించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు కింద సూచించిన అలవాట్లను తప్పనిసరిగా నియంత్రించుకోవాలి లేదా మానేయాలి. కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

కాలేయానికి హాని కలిగించేవి పదార్థాలు..

ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కాకుండా మీ కాలేయ ఆరోగ్యాన్ని పాడుచేసే కొన్ని ఆహారాలు, పానీయాలు కూడా ఉన్నాయి. మీరు వాటికి దూరంగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

షుగర్: తిపి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. పంచదార తినడం వల్ల ఊబకాయం పెరిగి దంతాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది. అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెర, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర కాలేయానికి ఆల్కహాల్ వలె హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్స్ (పిండి పదార్థాలు): మైదా లేదా ఎక్కువ తెల్లటి పిండి పదార్థాలను తినకూడదు. ఇవి ఎక్కువగా ప్రాసెస్ అవుతాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రకమైన పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. పిండితో చేసిన పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, బ్రెడ్ వంటి వాటిని డైట్ నుంచి తీసివేయాలి.

రెడ్ మీట్: మాంసాహారం తినడం వల్ల శరీరానికి ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది. కానీ కాలేయం ఎక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టమవుతుంది. రెడ్ మీట్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే కాలేయం దానిని జీర్ణం చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అదనపు ప్రోటీన్ కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుంది.

పెయిన్‌కిల్లర్స్: కొంతమంది కొంచెం నొప్పి వచ్చినా పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటుంటారు. కానీ అది లివర్‌పై ప్రభావం చూపుతుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పెయిన్ కిల్లర్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అందువల్ల, నొప్పి నివారణ మందులను వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి.

ఎక్కువ విటమిన్ ఎ: విటమిన్ ఎ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో కళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. నారింజ పండ్లు, కూరగాయల నుంచి విటమిన్ ఎ పొందవచ్చు. కానీ కొంతమంది కాలేయాన్ని దెబ్బతీసే విటమిన్ ఎ సప్లిమెంట్లను కూడా తీసుకుంటుంటారు. ఇది మంచిది కాదు. అధిక మోతాదులో విటమిన్ ఎ సప్లిమెంట్లు తీసుకోవడం కాలేయ వ్యాధిని తీవ్రతరం చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..