CLAT 2022 Special: క్లాట్ 2022 పరీక్షకు హాజరవుతున్నారా? చివరి నిముషంలో ఈ తప్పులు చేయకండి..
పరీక్షకు ఇంకా మూడు రోజులే గడువు ఉన్నందున విద్యార్ధులు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్.. లా ప్రిపరేషన్ ట్యుటోరియల్స్ వ్యవస్థాపకుడు సాగర్ జోషి మాటల్లో మీకోసం..
CLAT 2022 Exam Date: దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ, పీసీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 19న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు CLAT 2022 ప్రవేశ పరీక్ష జరగనుంది. 80 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అడ్మిట్ కార్డులు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు ఇంకా మూడు రోజులే గడువు ఉన్నందున విద్యార్ధులు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్.. లా ప్రిపరేషన్ ట్యుటోరియల్స్ వ్యవస్థాపకుడు సాగర్ జోషి మాటల్లో మీకోసం..
క్లాట్ 2022 పరీక్షకు ఇంకా వారం రోజులు కూడా సమయం లేదు. పరీక్ష సమయం దగ్గర పడే కొద్దీ చాలా మంది చేసే తప్పులు మీరు చేయకండి. చివరి క్షణంలో కొత్త విషయాలేమీ చదవకూడదు. చదివిన వాటినే మరల మరలా పునఃశ్చరన చేసుకోవాలి. ముఖ్యంగా క్లాట్ పరీక్ష మానసిక శక్తి అగ్నిపరీక్ష లాంటిది. కాబట్టి భయాందోళనలకు బదులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే ఇలా చేయండి. ఇప్పటి వరకు ఏం చదివినా వాటిని మళ్లీ చదివండి. దీనితో పాటు చివరి నిమిషంలో మాక్ టెస్ట్‌లు చాలా ముఖ్యమైనవి. మాక్ టెస్ట్‌ల్లో మీరు తరచుగా ఏ సెక్షన్‌లో తప్పులు చేస్తున్నారో గుర్తించి, సరిదిద్దుకోవాలి. పరీక్ష సమయంలో రిలాక్స్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటే టెక్నిక్‌తో ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి. ఇలా చేస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు
- పరీక్షకు ముందు టెన్షన్ పడడం మామూలే. అయితే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రశ్నాపత్నం శ్రద్ధగా అధ్యయనం చేసి, మెదడులో నిల్వ చేసిన విషయాలను సరిగ్గా ఉపయోగిస్తారు.
- మీరు చదువుతున్న లేదా చదివిన సబ్జెక్ట్ లేదా టాపిక్ ఏదైనా.. దాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. దీంతో చివరి నిమిషంలో భారం పెరగదు.
- పరీక్షకు సన్నద్ధం కావడానికి అత్యంత ముఖ్యమైన విషయం మన రాత వేగం. కాబట్టి మీరు CLAT పరీక్ష కంటే ముందు ఎక్కువగా, వేగంగా మాక్ టెస్ట్‌లను పరిష్కరిస్తే పరీక్ష సరళిని అర్థం మవడంతోపాటు, వేగం కూడా పెరుగుతుంది.
- పరీక్షకు సిద్ధం కావాలంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇందుకోసం రోజూ 5 నుంచి 6 గంటల పాటు నిద్రపోవాలి. మీ నిద్ర మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా మీరు పూర్తిగా రిఫ్రెష్ అవుతారు. చదువులపై దృష్టి పెట్టగలుగుతారు.
- పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి పరీక్ష రోజున మీ సమయాన్ని, శక్తిని ఆదా చేయడానికి మొదట తెలిసి, సులువైన ప్రశ్నలను రాయడానికి ప్రయత్నించండి.
-Sagar Joshi, Law Prep Tutorial
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.