Bella Jay Dark: ఐదేళ్ల వయసులోనే 32 పేజీల పుస్తకాన్ని రాసిన బాలిక.. గిన్నిస్ బుక్‌లో చోటు..
బ్రిటన్‌కు చెందిన ఈ అమ్మాయి కేవలం 5 ఏళ్లకే రచయిత్రిగా మారి 32 పేజీల పుస్తకాన్ని రాసింది. పుస్తకం రాయడమే కాదు.. ఆ పుస్తకం కూడా ప్రచురించబడిం. దీనితో ఆ చిన్నారి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
Bella Jay Dark: ప్రస్తుత జనరేషన్ లోని చిన్నారులు పుట్టక ముందు కొన్ని.. భూమిమీద పడిన వెంటనే మరికొన్ని నేర్చుకున్న అత్యంత ప్రతిభావంతులు ఏమో(Talented Kids) అనిపిస్తున్నారు.ఎందుకంటే పెద్దలు చేయలేని పనులను కూడా చిన్నారులు.. తమ చిన్ని బుర్రతో ఆలోచించి.. చిట్టి చిట్టి చేతులతో.. చేసేస్తున్నారు. సర్వ సాధారణంగా, 5-6 సంవత్సరాల వయస్సు పిల్లలు ఆట, పాటలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఎక్కువగా చదువు, రచనలపై ఎక్కువ శ్రద్ధ చూపరు. అయితే ప్రస్తుతం ఓ ఐదేళ్ల బాలిక ప్రతిభ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. సాధారణంగా 25-30 ఏళ్లలోపు వారిలో కనిపించని పరిపక్వత ఈ వయసులో ఆ బాలిక కనబరుస్తుంది. వాస్తవానికి ఈ చిన్నారి బాలిక కేవలం 5 సంవత్సరాల వయస్సులోనే రచయితగా మారింది. అంతేకాదు 32 పేజీల పుస్తకాన్ని రాసింది. పుస్తకం రాయడమే కాదు.. ఆ రచన పుస్తకం కూడా ప్రచురించబడింది. దీనితో ఆ బాలిక పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..
ఈ అమ్మాయి పేరు బెల్లా జె డార్క్.. గ్రేట్బ్రిటన్ లోని వేమౌత్‌లో బెల్లా నివసిస్తుంది. ఈ చిన్నారి ఓ రచన చేయడమే కాదు.. ఆ పుస్తకాన్ని ప్రచురించడంతో.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన రచయితగా ఖ్యాతిగాంచింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఆ చిన్నారి బాలిక పుస్తకం రాయడమే కాకుండా.. ఆ పుస్తకంలో కనిపించే చిత్రాలను కూడా ఆమె స్వయంగా రూపొందించింది.
1000 కాపీలు అమ్మకం: ఆ అమ్మాయి రాసిన పుస్తకం పేరు ‘ది లాస్ట్ క్యాట్ ‘. ఈ పుస్తకం ప్రచురించబడిన వెంటనే.. సుమారు వెయ్యి కాపీలు కూడా అమ్ముడయ్యాయి. బెల్లా తల్లి చెల్సియా మాట్లాడుతూ.. తన కూతురు పుస్తకం రాయాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు.. తాను మొదట లైట్ గా తీసుకున్నని.. కానీ తన కుమార్తె.. పుస్తక రచన విషయంలో చాలా ఆలోచిస్తుందని.. రచనను చాలా సీరియస్ గా తీసుకుందని తాను గుర్తించి.. అప్పటి నుంచి తాను బెల్లాకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది.
ఆ అమ్మాయి తాను రాసిన రచన పుస్తకంతో పిల్లల పుస్తకాల పబ్లిషర్ అయిన జింజర్ ఫెయిర్ ప్రెస్‌కి చేరుకోగానే.. ప్రెస్ వారు వెంటనే ఆ పుస్తకాన్ని ప్రచురించడానికి అంగీకరించారు. బెల్లా పుస్తకం ముద్రించబడింది. దీంతో బెల్లా ప్రపంచ రికార్డును సృష్టించింది.
‘ది లాస్ట్ క్యాట్ 2’ కోసం సిద్ధమవుతున్న బెల్లా: నివేదికల ప్రకారం.. ‘ది లాస్ట్ క్యాట్’ కథ ఏమిటంటే.. పిల్లి ఎక్కడో తప్పిపోతుంది. అప్పుడు పిల్లి పిల్ల తన తల్లి లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదని తెలుసుకుంటుంది. ఈ పుస్తకం పిల్లలకు మంచి సందేశం ఇస్తుందని పాఠకుల అభిప్రాయం. ఈ పుస్తకం జనవరి 31, 2022న ప్రచురించబడింది. ఇప్పుడు బెల్లా తన పుస్తకం ‘ది లాస్ట్ క్యాట్’ సెకండ్ సిరీస్ ను అంటే ‘ది లాస్ట్ క్యాట్ 2’ని వ్రాయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..