Vancouver Library: 51ఏళ్ల తర్వాత లైబ్రెరీకి పుస్తకాన్ని తిరిగి ఇచ్చిన వ్యక్తి.. కొంచెం లేట్ అయింది క్షమించమని లెటర్

వాంకోవర్ పబ్లిక్ లైబ్రరీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి 51 సంవత్సరాల తర్వాత పుస్తకాన్ని తిరిగి లైబ్రరీకి ఇచ్చాడు.

Vancouver Library: 51ఏళ్ల తర్వాత లైబ్రెరీకి పుస్తకాన్ని తిరిగి ఇచ్చిన వ్యక్తి.. కొంచెం లేట్ అయింది క్షమించమని లెటర్
Vancouver Library
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2022 | 9:45 AM

Vancouver Library: ఇప్పుడంటే.. ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా, చదువుకోవాలన్న ఆధునిక సాంకేతిక సాయంతో.. గూగుల్ సెర్చ్ చేసి చదువుతుకుంటున్నారు.. కానీ గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ చదువుకోవాలన్నా, ఏదైనా సరికొత్త విషయాలు తెలుసుకోవాలన్నా.. పాఠశాలలు, కళాశాలల లైబ్రరీలను ఆశ్రయించాల్సిందే. అక్కడ నుంచి చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చుకునేవారు.. ఈ విషయం అప్పటి రోజులు కొంతమందికి గుర్తుండే ఉండాలి. ఆ సమయంలో.. లైబ్రెరీనుంచి పుస్తకం తెచ్చుకుంటే.. పుస్తకాన్ని గడువు తేదీకి ముందే తిరిగి ఇచ్చేలా జాగ్రత్త వహించాలి..  ఎందుకంటే అలా చేయకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చేది. అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు పుస్తకాన్ని తిరిగి ఇవ్వాల్సిన తమ గడువు తేదీని మరచిపోయెవారు. అనంతరం లైబ్రెరీకి వెళ్లి.. బాగా తిట్లు వినవలసి వచ్చింది. మరి అలాంటిది ఒక పుస్తకాన్ని లైబ్రెరీ నుంచి తెచ్చి.. మరచిపోయి.. తిరిగి 51 సంవత్సరాల తర్వాత పుస్తకాన్ని తిరిగి ఇస్తే? వ్యక్తి ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందో ఆలోచించండి.. ఇది రియల్ గా జరిగిన సంఘటన. వివరాలోకి వెళ్తే..

బ్రిటీష్ కొలంబియాలోని లైబ్రరీ నుండి అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 1971లో ఒక వ్యక్తి తన పేరు మీద పుస్తకాన్ని లైబ్రెరీ నుంచి తీసుకున్నాడు.. ఇప్పుడు ఐదు దశాబ్దాల తర్వాత పుస్తకం తిరిగి లైబ్రరీకి రిటర్న్ ఇచ్చాడు.  పుస్తకాన్ని తిరిగిచ్చిన వ్యక్తి అందులో చిన్న నోట్ రాసి ఆలస్యానికి క్షమాపణలు చెప్పాడు. ఆ తరువాత పుస్తకం అందుకున్న వ్యక్తి  కోపం అంతా పోయింది.  గడువు తేదీ లోపులో అతను పుస్తకాన్ని తిరిగి ఇవ్వలేకపోయాడంటే..  అతనికి  ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్ధం చేసుకోవచ్చు.  ఆ వ్యక్తికీ వ్యక్తిగతంగా ఏర్పడిన ఇబ్బందుల వలన  కాలపరిమితిలోపు పుస్తకం వంటి వాటిని తిరిగి ఇవ్వలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

అయితే దాదాపు 50 ఏళ్ల తర్వాత లైబ్రెరీకి పుస్తకాన్ని తిరిగి ఇస్తే.. అతనికి ఎంత జరిమానా విధించడానికి అనుమానం వస్తే.. దానికి సమాధానం మీ కోసం.. ఆ వ్యక్తి నిజాయితీకి అతని అదృష్టం తెచ్చింది. అంతేకాదు బహుమతిగా ఆ వ్యక్తి  జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని లైబ్రెరీ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల లైబ్రరీ తన నిబంధనలను మార్చింది. తద్వారా ఆలస్యంగా పుస్తకాన్ని తిరిగి ఇచ్చేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

వాంకోవర్ పబ్లిక్ లైబ్రరీ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇదే విషయంపై స్పందిస్తూ.. హ్యారీ ఎడ్వర్డ్ నీల్ పుస్తకం.. ది టెలిస్కోప్. ఈ పుస్తకంలో ఒక లెటర్ ఉన్నది. ఆ లెటర్ లో తాను ఈ పుస్తకాన్ని ఆలస్యంగా తిరిగి లైబ్రేరికి ఇస్తున్నందుకు.. ఇన్నాళ్లు ఆలస్యం చేసినందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పాడు. ఈ సారీ నోట్‌లో పుస్తకాన్ని తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగి ఉండవచ్చు.. కానీ పుస్తకం ఇప్పటికీ  మంచి స్థితిలో ఉంది.. హాయిగా మరొకరు ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చని లెటర్ లో పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ