World’s largest plant: వింతల్లో కెల్లా వింత.. ప్రపంచంలోనే అతి భారీ మొక్క..దీని గురించి వివరాలు తెలిస్తే షాక్..
నీటి అడుగున ఉన్న ఓ వింత వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ నీరు అంటే.. జలచరాలు అని భావించేవారికి షాక్ ఇస్తూ.. నీటి అడుగున.. అతి భారీ మొక్కను గుర్తించారు శాస్త్రజ్ఞులు. ఈ మొక్క పొడవు సుమారు 180 కిలోమీటర్లు ఉంటుందని..
World’s largest plant: ప్రకృతి అనేక వింతలు, విశేషాల మయం. భూమి, ఆకాశం, నీరు ఇలా ప్రతి చోటా మనకు తెలియని.. అంతుచిక్కని అనేక రహస్యాలతో పాటు, వింతలు విశేషాలున్నాయి. ఇదే విషయం శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెలుగులోకి వస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా నీటి అడుగున ఉన్న ఓ వింత వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ నీరు అంటే.. జలచరాలు అని భావించేవారికి షాక్ ఇస్తూ.. నీటి అడుగున.. అతి భారీ మొక్కను గుర్తించారు శాస్త్రజ్ఞులు. ఈ మొక్క పొడవు సుమారు 180 కిలోమీటర్లు ఉంటుందని.. అందుకనే ఈ మొక్క ప్రపంచంలోనే అతి మొక్క అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ మొక్క ప్రపంచంలోనే అతిపురాతమైన మొక్క అని కూడా భావిస్తున్నారు. మరి ఈ పొడవైన మొక్క ఎక్కడ ఉంది.. తెలుసుకుందాం..
శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో షార్క్ తీరంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను కనుగొన్నారు. సముద్రం అడుగున తనని తాను పదేపదే క్లోనింగ్ చేసుకుంటూ పెరిగిన సముద్రపు గడ్డి మైదానం ఇదని గుర్తించారు. పోసిడోనియా ఆస్ట్రేలిస్ రకం మొక్క అని.. సుమారు 4,500 సంవత్సరాలకు పూర్వం నాటిదని పరిశోధకులు తెలిపారు. ఈ మొక్క దాదాపు 70 చదరపు మైళ్లు ( 180 కిలోమీటర్ల) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే ఈ సైజు మొక్క గుర్తించడం ఇదే తొలిసారని జన్యు శాస్త్రజ్ఞులు వెల్లడించారు.
ఈ మొక్క ఉపరితల విస్తీర్ణం 20 వేల రగ్బీ మైదానాలకు సమానంగా ఉంది. వాషింగ్టన్ నగరం కంటే పెద్దదిగా.. మాన్‌హట్టన్ ఐల్యాండ్‌కు మూడు రెట్లు సైజులో ఉంది. ఈ మొక్క సముద్ర గర్భంలో వింతల గురించి పరిశోధన చేస్తుండగా.. అనుకోకుండా వెలుగులోకి వచ్చిందని.. దీని సీగ్రాస్ రెమ్మల DNA ని నమూనా పరీక్ష చేసి.. ఈ పచ్చికభూమి ఒకే జీవి అని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఈ మొక్క ఒక విత్తనం నుంచే ఇది విస్తరించిందని జన్యు పరిశోధన ద్వారా వెల్లడైందని వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో అధ్యయన సహ రచయిత, సముద్ర జీవశాస్త్రవేత్త జేన్ ఎడ్గెలో పేర్కొన్నారు. రాయల్ సొసైటీ మ్యాగజైన్‌లో ఈ మేరకు ఈ మొక్కపై అధ్యయనం ప్రచురితమైంది.
Our researchers have discovered the world’s largest plant in our very own Shark Bay. The seagrass is dated to be 4,500 years old, stretching across 180km??? #UWA pic.twitter.com/EgQu8ETBSF
— UWA (@uwanews) June 1, 2022
సముద్రపు గడ్డి మైదానం అయినప్పటికీ హాని కలిగిస్తుందని తెలిపారు. ఒక దశాబ్దం క్రితం.. సముద్రపు గడ్డి అదనంగా ఏడు చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. అయితే తుఫానులు, వాతావరణ మార్పులతో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు ఈ పురాతన సీగ్రాస్ బెడ్‌లోని దాదాపు పదవ వంతును చంపాయని పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి