వంట గ్యాస్ మధ్యలో అయిపోతుందని టెన్షనా.. గ్యాస్ ఎంత ఉందో ఇలా తెలుసుకోండి!
Samatha
13 march 2026
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండాల్సిన వాటిలో వంట గ్యాస్ ముఖ్యమైనది. ఇది లేకుంటే వంట గది అసంపూర్ణమే.. వంట గ్యాస్ లేకుండా, పూట గడవదు.
వంటిళ్లు
ఎందుకంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారు చాలా మంది ఏదో ఒకటి వంట గ్యాస్ పై చేస్తూనే ఉంటారు. అందుకే చాలా మంది వంట గ్యాస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పుడూ ఒకటి ఎక్స్‌ట్రా పెట్టుకుంటారు.
వంటిళ్లు
అయితే యుద్ధం ఎఫెక్ట్, హార్ముజ్ జలసంధి కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తెలంగాణలో ఎల్ పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ లేకపోవడంతో చాలా మంది కట్టల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నారు.
యుద్ధ ప్రభావం
దీంతో గ్యాస్ ఉన్నవారు , వంట గ్యాస్ ఎప్పుడు అయిపోతుందా? అని తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే మీ గ్యాస్ కూడా త్వరగా అయిపోతుందేమో అనే సందేహం ఉందా? అయితే ఇలా చెక్ చేసుకోండి.
గ్యాస్ అయిపోవడం
ఒక కాటన్ క్లాత్ తీసుకొని, దానిని నీటిలో నానబెట్టి, వాటర్ మొత్తం పిండండి. చుక్క నీరు లేకుండా ఉన్నప్పుడు, దానిని గ్యాస్ సిలిండర్ పై పెట్టి, పై నుంచి కిందకు తుడవండి.
కాటన్ క్లాత్
రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే, సిలిండర్‌ను గమనిస్తే, గ్యాస్ లేని ఖాళీ భాగం త్వరగా అయిపోయి పోడిగా మారితే, గ్యాస్ ఉన్న భాగం మాత్రం తడిగానే ఉంటుంది.
రెండు నిమిషాలు
బరువును బట్టి కూడా మీరు గ్యాస్ ఉందా? అయిపోతుందా? అనేది తెలుసుకోవచ్చును. చాలా తేలికగా అనిపిస్తే రెండు లేదా మూడు రోజుల్లో గ్యాస్ అయిపోతుందని అర్థం.
రెండు నిమిషాలు
అలాగే ఒక గ్లాస్‌లో నీటిని తీసుకొని, గ్యాస్ సిలిండర్ పై పైనుంచి కిందకు పోయండి. మీ చేతితో తాకుతూ రాండి, అప్పుడు గ్యాస్ ఉన్న చోట చల్లగా, గ్యాస్ లేని ఖాళీ ప్రదేశంలో కాస్త వెచ్చగా తాకుతుంది.