Pakistan: తక్షణమే ఎన్నికలు నిర్వహించండి.. లేకపోతే అంతర్యుద్ధమే.. ఇమ్రాన్ ఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్తాన్(Pakistan) లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) డిమాండ్ చేశారు. లేకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. నిరసనకారులకు రక్షణ కల్పించాలన్న...

Pakistan: తక్షణమే ఎన్నికలు నిర్వహించండి.. లేకపోతే అంతర్యుద్ధమే.. ఇమ్రాన్ ఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Imran Khan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 02, 2022 | 1:42 PM

పాకిస్తాన్(Pakistan) లో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) డిమాండ్ చేశారు. లేకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. నిరసనకారులకు రక్షణ కల్పించాలన్న తమ పార్టీ అభ్యర్థనపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. చట్టబద్ధమైన, రాజ్యాంగపరమైన మార్గాల ద్వారా ఎన్నికలకు వెళ్దామని పిలుపునిచ్చారు. ఏప్రిల్ లో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగిన విషయం విదితమే. అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయనను తొలగించినప్పటికీ.. ఫలితాన్ని అంగీకరించేందుకు ఆయన నిరాకరించారు. అంతే కాకుండా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా పాత్ర ఉందని ఆరోపించారు.  ఆయన పదవి నుంచి తొలగింపబడినప్పటి నుంచి మళ్లీ ఎన్నికలకు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి చెందిన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం కాదని ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

తన డిమాండ్ ను నెరవేర్చాలంటూ ఇమ్రాన్ ఖాన్ వేలాది మంది మద్దతుదారులతో కలిసి ఇస్లామాబాద్‌ లో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. కానీ చివరి క్షణంలో ఆందోళన విరమించుకున్నారు. అయిప్పటికీ దేశంలో ముందస్తు ఎన్నికలకు తెరలేపకుండే మళ్లీ తిరిగి వస్తానని ఇమ్రాన్ స్పష్టం చేశారు. అయితే.. పాకిస్తాన్‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని అంత‌ర్జాతీయ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. పూర్తికాలం ప‌ద‌విలో ఉండేందుకే పాక్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ నిశ్చయించుకున్నార‌ని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి