US shooting: మళ్ళీ అమెరికాలో కాల్పుల మోత.. ఒకర మహిళ మృతి, మరో ఏడుగురికి గాయాలు..

అమెరికాలోని ఓక్లహోమాలో అక్కడ సమయం ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఈ దారుణం జరిగింది.

US shooting: మళ్ళీ అమెరికాలో కాల్పుల మోత.. ఒకర మహిళ మృతి, మరో ఏడుగురికి గాయాలు..
Oklahoma
Follow us

|

Updated on: May 30, 2022 | 9:47 AM

US shooting: అగ్రరాజ్యం అమెరికాలో వరస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి.  ఇటీవల స్కూల్ లో జరిగిన కాల్పుల ఘటన మరవక ముందే అమెరికాలో మళ్ళీ తుపాకీ మోత మ్రోగింది. ఓ యువకుడు అకస్మాత్తుగా స్థానిక ప్రజలపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్ధం వినిపించిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ఓ మహిళల మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఓక్లహోమాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని  ఓక్లహోమాలో అక్కడ సమయం ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఈ దారుణం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..తుల్సాకు ఆగ్నేయంగా ఉన్న టాఫ్ట్ సమీపంలో జరిగిన మెమోరియల్ డే భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ లో ఘర్షణ చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన 26ఏళ్ల స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.

ఈ కాల్పుల్లో ఓ నల్లాజతి మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు చెప్పారు. ఒక్కసారిగా కాల్పులు మోత విన్న వెంటనే ప్రజలు భయాందోళనతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీసినట్లు సాక్షులు వివరించారు. ఇక కాల్పులు జరిపిన అనంతరం బక్నర్ అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాల్పులు జరిపిన రోజు సాయంత్రమే బక్నర్ పోలీసులకు లొంగిపోయాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..