- Telugu News Photo Gallery World photos Viral News: She started college in the 50s. Decades later, she fulfilled her dream of graduating at age 84
Viral News: ఏభై ఏళ్ళక్రితం వదిలేసిన చదువు.. 84 ఏళ్ల వయసులో మళ్ళీ మొదలు.. డిగ్రీ పాసై ఔరా అనిపిస్తున్న బామ్మగారు!
84 ఏళ్ల వృద్ధురాలు తాజాగా గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువుకు వయసు లేదని నిరూపించింది.
Updated on: May 31, 2022 | 9:12 AM

ఓ మహిళకు చిన్నతనం నుంచి చదువు అంటే అమితమైన ఇష్టం.. అయితే పేదరికం, కుటుంబ బాధ్యతలు, డబ్బుల ఇబ్బందితో తన చదువుకోలేని కోరికను చంపుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా తన 84వ ఏట డిగ్రీ పట్టాను పుచ్చుకుని అందరికి షాక్ ఇచ్చింది.

USAలోని మిన్నెసోటా నివాసి బెట్టీ శాండిసన్ కు ఇప్పుడు 84 ఏళ్ళు. ఇప్ప్పుడు తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువుకు వయసు లేదని మహిళ నిరూపించింది.

ఒక వ్యక్తి ఏ వయసులో నైనా నేర్చుకోవచ్చు, ఏదైనా చేయగలదు అని నిరూపించింది. ఎందుకంటే వయసు పెరిగే కొలదీ వ్యక్తికీ జ్ఞాపక శక్తి తగ్గడం.. కంటి చూపు మసకబారడం వంటివి మార్పులు వస్తాయి. అందుకనే ఈ వయసులో డిగ్రీ పట్టాపుచ్చుకోవోడం అంటే సాధారణ విషయం కాదు.

మీడియా నివేదికల ప్రకారం.. శాండిసన్ 67 సంవత్సరాల క్రితం అంటే 1955 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టింది. ఆ సమయంలో తన ఊరిలో యూనివర్శిటీలో చదువుకోవడానికి చేరిన ఏకైక అమ్మాయిగా రికార్డ్ సృష్టించింది అయితే ఆమె కొన్ని అనుకోని పరిస్థితుల వలన చదువుకు మధ్యలో గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత పెళ్లయి, ఇద్దరు ఆడపిల్లలు జననం.. పిల్లల పెంపకం, కుటుంబాన్ని పోషించడంతో శాండిసన్ కు సమయం గడిచిపోయింది.

ఈ క్రమంలో 1979లో కూతురు కూడా కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తల్లిగా మరింత బాధ్యతలు పెరిగాయి. దీంతో కుటుంబ పోషణ కోసం నర్స్ గా ఆస్పత్రిలో అడుగుపెట్టింది. సుమారు 30 సంవత్సరాలు నర్సుగా పనిచేసింది. తన డిగ్రీ గురించి మరచిపోయింది.

అయితే తన ఉద్యోగానికి పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాల తర్వాత తన అసంపూర్తి డిగ్రీ గుర్తుకు చేసుకుంది. దీంతో డిగ్రీని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.

దీంతో తన తల్లిని కూతురు 2018లో చదువుని మళ్ళీ ప్రారంభించమని సూచించింది. దీంతో ఇప్పుడు శాండిసన్ తన 84 ఏళ్ల వయసులో ఈ ఏడాది మే 7న డిగ్రీ పూర్తిచేసింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. చదువు కోసం శాండిసన్ తన స్ఫూర్తి మరింత మంది యువతకు స్ఫూర్తినిస్తోంది.





























