నేడు ప్రపంచం ఎంతో అభివృద్ధి సాధించింది. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎద్దుల బండి, గుర్రపు బండి, సైకిల్‌తో వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో వేగంగా ప్రయాణించే వాహనాలు వచ్చాయి. అంతేకాదు రైళ్లు, విమానాలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. ముఖ్యంగా విమాన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిల్లో ప్రయాణం సమయాన్ని ఆదా చేస్తాయి. సాధారణంగా కారులో లేదా రైళ్లలో ప్రయాణించడానికి 15-15 గంటలు పడితే.. అపుడు విమానంలో ప్రయాణం చేస్తే కేవలం 2-3 గంటల్లో పూర్తవుతుంది. అయితే ప్రస్తుతం కూడా ఒక్క విమానాశ్రయం లేని దేశాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆయా దేశాలకు వెళ్లాలంటే సముద్రం లేదా రోడ్డును ఉపయోగించాల్సి వస్తోంది. ఈ దేశాల గురించి తెలుసుకుందాం..