Viral Video: లక్షల సంఖ్యలో కప్పలను పెంచుతున్న బ్రిటన్ వ్యక్తి.. ఈ హాబీ వెనుక ఓ లెక్కుంది..
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమగా కప్పలను పెంచుతారని విన్నారా? వర్షాకాలంలో ఒక కప్పు బెకబెకమంటేనే ఆమ్మో అనిపిస్తుంది. అలాంటి ఓ వ్యక్తి.. తన ఇంటి తోటలో లక్షల కప్పలను పెంచుతున్నాడు. ఓ కప్పల ఆర్మీనే తయారు చేశాడు
Viral Video: మనిషి కొన్ని జంవుతులను మచ్చిక చేసుకుని పెంపుడు జంవుతులుగా మార్చేసుకున్నాడు. కుక్క, పిల్లిని పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అత్యంత ఇష్టంగా పెంచుకునే జంతువుల్లో ఇవి మొదటి స్థానంలో ఉంటాయి. కొంతమంది ఏనుగులు, గుర్రాలను కూడా పెంచుకోవడానికి ఇష్టపడతారు. కోడి, బాతు వంటి పక్షులనే కాదు.. అదే సమయంలో కొంతమంది తమ అభిరుచి లేదా వాస్తు ప్రయోజనాల కోసం ఇంట్లో చేపలు, తాబేళ్లను కూడా పెంచుతారు. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమగా కప్పలను పెంచుతారని విన్నారా? వర్షాకాలంలో ఒక కప్పు బెకబెకమంటేనే ఆమ్మో అనిపిస్తుంది. అలాంటి ఓ వ్యక్తి.. తన ఇంటి తోటలో లక్షల కప్పలను పెంచుతున్నాడు. ఓ కప్పల ఆర్మీనే తయారు చేశాడు. వివరాల్లోకి వెళ్తే..
బ్రిటన్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇంటి తోటలో లక్షలాది కప్పలను పెంచుకున్నాడు. అతను మొత్తం కప్పల సైన్యాన్ని నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ వింత కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .
దీనికి సంబంధించిన వీడియో @ramseyboltin అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కప్పల సైన్యం మొత్తం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన జనాలు ఈ వ్యక్తి కప్పల సైన్యాన్ని ఎందుకు సిద్ధం చేసాడు అని ఆశ్చర్యపోతున్నారు.
Frog army on TikTok. This guy is creating an entire frog population (1m) in his backyard. It’s honestly crazy. https://t.co/TaKkAlNUM0 pic.twitter.com/h0mZrxXM16
— Arlong (@ramseyboltin) June 8, 2022
మీడియా నివేదికల ప్రకారం.. తన ఇంటి తోటలో సుమారు 1.4 మిలియన్ కప్పలు ఉన్నాయని వ్యక్తి పేర్కొన్నాడు. ట్విటర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. చిన్నా పెద్దా కప్పలు ఒక చోట నుంచి మరొక చోటకు చేస్తోన్న ప్రయాణాన్ని చూపించారు. ఆ వ్యక్తి మొదట కప్పల గుడ్లను నీటిలో ఉంచినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. కొంత సమయం తరువాత.. చిన్న కప్పలు దూకుతున్నలు కనిపిస్తుంది. అప్పుడు కప్పల సైన్యం మొత్తం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కప్పలకు నివాసంగా మొత్తం తోట మారిపోయింది. ఇప్పుడు తోటలో ఎక్కడ చూసినా కప్పలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మనుషులు తిరిగేందుకు కూడా స్థలం లేదు. సరదాగా కోసమే 95 రోజుల క్రితం కప్పల గుడ్లను పెంచుకోవడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది..
ఆ వ్యక్తి 95 రోజుల క్రితం 1.4 మిలియన్ లేదా 1.4 మిలియన్ కప్ప గుడ్లను నీటిలో ఉంచినట్లు వీడియోలో ద్వారా తెలుస్తోంది. కప్పల పెంపకంపై ఒక ప్రయోగంగా చేసాడు.. కానీ ఎందుకు, సమాధానం లేదు. వీడియో చూసిన తర్వాత, ప్రజలు కూడా ఇన్ని కప్పలను అతను ఏమి చేస్తాడు అంటూ పశ్నిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..