AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Police: ఓ వ్య క్తి వేటకత్తితో దాడికి పాల్పడినా తగ్గని ఎస్సై.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఓ వ్యక్తి వేటకత్తితో నరకడానికి వస్తున్నా భయపడలేదు ఆ పోలీస్‌ అధికారి.. అతడిని ధైర్యంగా ఎదుర్కొని చాకచక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Kerala Police: ఓ వ్య క్తి వేటకత్తితో దాడికి పాల్పడినా తగ్గని ఎస్సై.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో
Brave Police Officer
Surya Kala
|

Updated on: Jun 19, 2022 | 6:07 PM

Share

Kerala Police: సమాజంలో పోలీసు పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 24గంటలు ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణ కోసం విధులను నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని సార్లు.. దుండగులను పట్టుకునే సమయంలో అనేక అపాయాలను ఎదుర్కొంటుంటారు.. అందుకనే పోలీసు ఆఫీసర్ ధైర్యానికి సంబంధించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటాయి. దాదాపు హిట్ గానే నిలుస్తాయి. తాజాగా ఓ పోలీసు ఆఫీసర్ ధైర్యానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వేటకత్తితో నరకడానికి వస్తున్నా భయపడలేదు ఆ పోలీస్‌ అధికారి.. అతడిని ధైర్యంగా ఎదుర్కొని చాకచక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేశారు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే…

కేరళలోని అళప్పుళ జిల్లాలో నూరానాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుమార్‌ అనేవ్యక్తి ఎస్సైగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బందితో కలిసి ఆయన పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా పారా జంక్షన్‌లో రోడ్డు పక్కన స్కూటీ పార్క్‌ చేసిన ఓ వ్యక్తి దగ్గర ఎస్సై తన వాహనాన్ని నిలిపారు. కారు దిగి అక్కడ స్కూటీవద్ద నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తుండగా.. ఒక్కసారిగా అతను వేట కత్తి తీసి ఎస్సైపై దాడికి దిగాడు.

ఇవి కూడా చదవండి

అత్యంత ప్రమాదరకంగా ఆ వ్యక్తి ఎస్సైపై కత్తి విసురుతున్నా వెనక్కి తగ్గలేదు ఎస్సై అరుణ్‌ కుమార్‌. ఎంతో చాకచక్యంగా ధైర్యంగా అతణ్ని ఎదుర్కున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి అతనికి దేహ శుద్ధి చేశారు. అనంతరం అతన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ దాడిలో ఎస్సై గాయపడ్డారు. కాగా ఈ వీడియోను ఓ వ్యక్తి తన మొబైల్‌లో షూట్‌ చేయగా.. పోలీసులు నెట్టింట పోస్ట్‌ చేశారు. దాంతో ఈ ఘటన కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..