AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in Gujarat: నా జీవితంలో బాగుందంటే.. తన తల్లి గొప్పదనమే అంటున్న ప్రధాని మోడీ

తల్లి హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఒక లేఖను రాశారు. ఆ లేఖలో మోడీ తల్లులందరికీ నివాళులు అర్పించారు పిల్లల జీవితంలో తల్లుల ప్రాముఖ్యత గురించి పేర్కొన్నారు.

PM Modi in Gujarat: నా జీవితంలో బాగుందంటే.. తన తల్లి గొప్పదనమే అంటున్న ప్రధాని మోడీ
Pm Modi Pens Heartfelt Note
Surya Kala
|

Updated on: Jun 18, 2022 | 10:25 AM

Share

PM Modi in Gujarat: నేడు ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ 100వ సంవత్సరంలో అడుగుపెట్టారు. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ తల్లిదగ్గరకు వెళ్లి తల్లి కాళ్ళు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు..చాలా కాలం తర్వాత.. మోడీ తన తల్లి కోసం రాసిన సుదీర్ఘ లేఖను పంచుకున్నారు.  ఆ లేఖలో.. ప్రధాని మోడీ తల్లులందరికీ నివాళులు అర్పించారు. ఏ పిల్లల జీవితంలోనైనా తల్లి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఏ పిల్లలకైతే.. తల్లిపై ప్రత్యేక ప్రేమాభిమానాలు ఉంటాయో.. అలాంటి పిల్లల కోసం తల్లులు నిస్వార్థంగా త్యాగం చేస్తారన్నారని అన్నారు.

“తల్లి – నిఘంటువులో ఒక పదం కాదు..  ప్రేమ, సహనం, విశ్వాసం..  ఇలా మరెన్నో భావోద్వేగాల సమ్మేళనం తల్లి. దేశం లేదా ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచం అంతటా  పిల్లలు తమ తల్లుల పట్ల ప్రత్యేక ప్రేమను , బంధాన్ని కలిగి ఉంటారు. ఒక తల్లి తన పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. పిల్లల వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తుంది. తన పిల్లల బంగారు భవిష్యత్ ను తీర్చిదిద్దే సమయంలో తల్లులు నిస్వార్థంగా తమ స్వంత వ్యక్తిగత అవసరాలు,  ఆకాంక్షలను త్యాగం చేస్తారుని మోడీ తల్లి చేసే త్యాగం గురించి ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

“ఈరోజు, మా అమ్మ శ్రీమతి హీరాబా తన వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారని ఇది మీ అందరితోనూ పంచుకోవడం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు మోడీ. మా అమ్మ 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఏడాది. . మా నాన్న జీవించి ఉంటే.. అతను కూడా గత వారం తన 100వ పుట్టినరోజు జరుపుకునేవారని తండ్రిని గుర్తు చేసుకున్నారు మోడీ.

గుజరాత్‌లో ఒక రోజు పర్యటన చేయనున్నారు మోడీ. పావగఢ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. వడోదరలో ర్యాలీలో ప్రసంగించనున్నారు.

మోడీ తన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని స్వస్థలం వాద్‌నగర్‌లో హిందూ ధార్మిక కార్యక్రమాలను  నిర్వహించారు. మోడీ కుటుంబం అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయంలో అన్నదానం కూడా చేయనున్నారు.

“నా జీవితంలో మంచిదైనా.. దానిలో తన తల్లిదండ్రుల పాత్ర ఉందని అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నా .. తాను గత జ్ఞాపకాలతో నిండిపోయినట్లు చెప్పారు. ఒక తల్లి తపస్సు ఒక మంచి మనిషిని సృష్టిస్తుంది. ఆమె ఆప్యాయత పిల్లల్లో మానవీయ విలువలు, సానుభూతిని నింపుతుంది. తల్లి ఒక వ్యక్తి లేదా వ్యక్తిత్వం కాదు.. మాతృత్వం అనేది ఒక గుణం” అని లేఖలో రాశారు.

కాగా, గాంధీనగర్‌లోని ఓ రోడ్డుకు బుధవారం మోడీ తల్లి హీరాబెన్ మోడీ పేరు పెట్టారు. “హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రేసన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అని పేరు పెట్టాలని మేము నిర్ణయించుకున్నామని గాంధీనగర్ మేయర్ పేర్కొన్నారు. తద్వారా ఆమె జీవితం నుండి తరువాతి తరం స్ఫూర్తి పొందుతుంది” అని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..