What India Thinks Today: అగ్నిపథ్ గొప్పది..దీని నుంచి వచ్చిన సైనికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంతోషిస్తాం- HUL ఛైర్మన్
హెచ్‌యుఎల్ ఛైర్మన్ సంజీవ్ మెహతా అగ్నిపథ్ పథకాన్ని ప్రశంసించారు. యువ సైనికులు కావాలి అని అన్నారు. ఈ పథకం నుంచి వచ్చిన సైనికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మేము సంతోషిస్తామని అన్నారు.
What India Thinks Today: TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో HUL ఛైర్మన్ సంజీవ్ మెహతా మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచం ముందు పోటీ పడాలంటే.. నాణ్యత, ధరల పై శ్రద్ధ వహించాలని అన్నారు. 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మన దగ్గర ఏమీ లేదు. ఆనాటి దేశ జీడీపీ.. నేటి మా కంపెనీ మార్కెట్ క్యాప్ కంటే తక్కువగా ఉందని అప్పటి దేశ పరిస్థితిని గుర్తు చేశారు. నిరంతరంగా అభివృద్ధి చెందుతూ.. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.
దేశంలో అగ్నిపథ్ పథకంపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ తెచ్చిన ఈ పతాకాన్ని సంజీవ్ మెహతా ప్రశంసించారు. భారతదేశ యువతకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. హెచ్‌యుఎల్ ఛైర్మన్ సంజీవ్ మెహతా అగ్నిపథ్ పథకాన్ని ప్రశంసించారు. దేశానికి యువ సైనికులు కావాలి అని అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా.. దేశం యువ సైనికులతో పాటు అనుభవజ్ఞులైన అధికారులతో మెరుగైన సమన్వయం లభిస్తుందని చెప్పారు. సైనికులుగా పనిచేసిన వారికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సంతోషిస్తామని అన్నారు. సంతోషంగా రెండవ విషయం ఏమిటంటే సైనికులుగా క్రమశిక్షణ గల వ్యక్తులుగా సైన్యం నుండి బయటకు వచ్చినప్పుడు.. సమాజంలో బాధ్యతగల పౌరులు తయారవుతారని.. అప్పుడు మనం కూడా సంతోషిస్తామని అన్నారు.
#Agnipath is the right thing for the country. When patriotic passionate people come out of the army, they would be a fertile pool for the corporate sector. We would certainly hire them: FICCI President Mr Sanjiv Mehta at #TV9GlobalSummit. pic.twitter.com/pTRV6lh2qz
— FICCI (@ficci_india) June 17, 2022
భారతదేశ వృద్ధి రేటు గురించి మాట్లాడుతూ.. నాలుగో పారిశ్రామిక విప్లవం భారత్‌కు బలాన్ని చేకూర్చేందుకు కృషి చేస్తోందన్నారు. హెచ్‌యుఎల్ ఛైర్మన్ సంజీవ్ మెహతా మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ వేదికపై పోటీ పడాలంటే… ధరల నిర్వహణ, నాణ్యతపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగాన్ని కొనసాగించేలా చూసుకోవాలి. దీని కోసం మనకు సమర్థవంతమైన నిర్వహణ అవసరమని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..