Punjab: 21 ఏళ్లకే మాజీ సైనికులుగా ఎలా మార్చగలం?.. కేంద్రానికి పంజాబ్ ముఖ్యమంత్రి సూటిప్రశ్న
అగ్నిపథ్(Agnipath) పథకాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అగ్నిపథ్....
అగ్నిపథ్(Agnipath) పథకాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM Bhagawant Mann) స్పందించారు. దేశ సేవ కోసం ప్రాణాలనూ లెక్కచేయకుండా ఆర్మీలో చేరే యువతకు.. నాలుగేళ్లు మాత్రమే సర్వీస్ నిబంధన పెట్టడం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. యువతకు నష్టం కలిగించే ఈ స్కీమ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ నిర్వహించలేదన్న భగవంత్ మాన్.. ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టి సైన్యంలో చేరిన వారికి నాలుగేళ్ల సర్వీస్ అంటూ యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు. 21 ఏళ్లకే యువతను మాజీ సైనికులుగా ఎలా మార్చగలం? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ రిటైర్ కారు.. కానీ, సాధారణ పౌరులు(ఉద్యోగులు), సైనికులు మాత్రమే రిటైర్ అవుతారని స్పష్టం చేశారు.
2 ਸਾਲ ਫੌਜ ‘ਚ ਭਰਤੀ ‘ਤੇ ਰੋਕ ਲਗਾਉਣ ਤੋਂ ਬਾਅਦ ਕੇਂਦਰ ਦਾ ਨਵਾਂ ਫਰਮਾਨ ਕਿ 4 ਸਾਲ ਫੌਜ ‘ਚ ਰਹੋ..ਬਾਅਦ ‘ਚ ਪੈਨਸ਼ਨ ਵੀ ਨਾ ਮਿਲੇ..ਇਹ ਫੌਜ ਦਾ ਵੀ ਅਪਮਾਨ ਹੈ..ਦੇਸ਼ ਦੇ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਵੀ ਧੋਖਾ ਹੈ..ਦੇਸ਼ ਭਰ ਦੇ ਨੌਜਵਾਨਾਂ ਦਾ ਇਹ ਗੁੱਸਾ..ਬਿਨਾਂ ਸੋਚੇ ਸਮਝੇ ਲਏ ਗਏ ਫ਼ੈਸਲੇ ਦਾ ਨਤੀਜਾ ਹੈ..ਫ਼ੈਸਲਾ ਤੁਰੰਤ ਵਾਪਸ ਲੈਣ ਦੀ ਮੰਗ ਕਰਦੇ ਹਾਂ..
ఇవి కూడా చదవండి— Bhagwant Mann (@BhagwantMann) June 17, 2022
అయితే.. సైన్యంలో దాదాపు 90వేల మంది సైనికులు పంజాబ్ నుంచి ఎంపికైన వారే ఉన్నారు. మొత్తం సైన్యంలో ఆ రాష్ట్రానికి చెందినవారే 8శాతం ఉంటారు. భారత సైన్యంలో చేరడానికి పంజాబ్ యువత ఎంతో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఏపీ, తెలంగాణల్లో నిరసనలు జరుగుతున్నాయి. నేడు బిహార్ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు సమ్మెకు తమ మద్దతును ప్రకటించాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి