శతవసంతంలోకి ప్రధాని మోదీ తల్లి.. గుజరాత్ లోని రహదారికి హీరాబా మార్గ్ గా పేరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ(Hiraben) రేపటితో(జూన్ 18) వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆమె 1923 జూన్‌ 18న జన్మించినట్లు ప్రధాని సోదరుడు పంకజ్‌ మోదీ తెలిపారు. ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలో ఆయన...

శతవసంతంలోకి ప్రధాని మోదీ తల్లి.. గుజరాత్ లోని రహదారికి హీరాబా మార్గ్ గా పేరు
Hiraben
Ganesh Mudavath

|

Jun 17, 2022 | 8:34 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ(Hiraben) రేపటితో(జూన్ 18) వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆమె 1923 జూన్‌ 18న జన్మించినట్లు ప్రధాని సోదరుడు పంకజ్‌ మోదీ తెలిపారు. ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలో ఆయన తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. గాంధీనగర్‌లోని హీరాబెన్ మోదీ ఎప్పుడు సందర్శించినా తల్లీకొడుకుల అనుబంధం ఎంత సన్నిహితంగా ఉందో మనకు అర్థమవుతుంది. మోదీ దేశానికి ప్రధాని(PM Modi) అయినప్పటికీ.. తన తల్లిని కలిస్తే అతి సామాన్యుడిలా మారిపోతుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని కావడానికి కొన్ని రోజుల ముందు హీరాబెన్ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లారు. ఈ సమయంలో హీరాబెన్ ఒక మిఠాయిని మోదీకి తినిపించారు. అంతేకాకుండా హీరాబెన్ మోదీకి రూ.101 ఇచ్చి, కొత్త ప్రయాణంలో విజయం సాధించాలని ఆశీర్వదించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ ఈ వయసులోనూ దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఎన్నికల్లో ఓటు వేయడం, నోట్ల రద్దు సమయంలో పాత రద్దయిన నోట్లను మార్చడం, కరోనా కాలంలో థాలీ వేలన్ ఆడటం వంటి విషయాల్లో హీరాబెన్ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు జనం బారులు తీరుతుండగా 90 ఏళ్లు దాటిన హీరాబెన్.. సామాన్యురాలిగా లైన్లో నిల్చొని ప్రజల్లో స్ఫూర్తి నింపారు.

కాగా హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున, రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అనే పేరు పెట్టాలని తాము నిర్ణయించుకున్నామని.. తద్వారా ఆమె జీవితం నుండి తరువాతి తరం స్ఫూర్తి పొందుతుందని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu