Agnipath: నిరసనలు కొనసాగుతున్నా వెనకడుగు వేయని కేంద్రం.. అగ్నివీరుల నియామక ప్రకటన విడుదల

అగ్నిపథ్(Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి(Air Chief Marshal VR Chaudhary) కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల...

Agnipath: నిరసనలు కొనసాగుతున్నా వెనకడుగు వేయని కేంద్రం.. అగ్నివీరుల నియామక ప్రకటన విడుదల
Air Chief Marshal Vr Chaudh
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 18, 2022 | 11:42 AM

అగ్నిపథ్(Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి(Air Chief Marshal VR Chaudhary) కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియాక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అగ్నిపథ్‌ పథకం ద్వారా నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడించగా.. తాజాగా నియామక ప్రకటన విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17.5 ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దీనికి దరఖాస్తు చేసువచ్చని తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సైనిక నియామకాలు చేపట్టనందున అగ్నిపథ్‌ తొలి రిక్రూట్‌మెంట్‌కు గరిష్ఠ వయో పరిమితిని 23ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. ఇది యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్మీలోనూ అగ్నిపథ్‌ నియామకాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో దీనిపై నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే చెప్పారు.

కాగా.. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పాత పద్ధతిలోనే సైన్యం నియామక ప్రక్రియ చేపట్టాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలు చోట్ల నిరుద్యోగుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. బిహార్, ఉత్తర​ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్లకు నిప్పంటించారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. సుమారు 35 ట్రైన్లను రద్దు చేయగా.. మరో 13 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి