Sonia Gandi: ఆస్పత్రిలో సోనియా గాంధీకి కొనసాగుతున్న చికిత్స.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన AICC

జూన్ 12న సోనియా గాంధీకి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి జైరాం రమేష్ తెలిపారు. ఆమె శ్వాసకోశ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో..

Sonia Gandi: ఆస్పత్రిలో సోనియా గాంధీకి కొనసాగుతున్న చికిత్స.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన AICC
Sonia Gandhi
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 17, 2022 | 1:24 PM

Sonia Gandi:  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్వాసనాళంలో ఫంగస్ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు కరోనా సోకడంతో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. సోనియాగాంధీకి ట్రీట్‌మెంట్ కొనసాగుతోందని కాంగ్రెస్ వెల్లడించాయి. వైద్యులు ఆమెకు ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలకు చికిత్స చేస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యాన్ని, పరిస్థితి వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

జూన్ 12న సోనియా గాంధీకి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి జైరాం రమేష్ తెలిపారు. ఆమె శ్వాసకోశ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

జూన్ 2న సోనియా గాంధీ రిపోర్ట్ కరోనా పాజిటివ్‌ తేలింది. తొలుత ఆమెకు స్వల్ప జ్వరం రావడంతో డాక్టర్స్‌ కోవిడ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అనంతరం, సోనియా గాంధీ జూన్ 12 వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. జూన్ 12 న ఆమె ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారటంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.

ఇకపోతే, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.. జూన్ 8న హాజరుకావాలని సోనియా గాంధీకి ఈడీ గతంలో సమన్లు​జారీ చేసింది. కరోనా సోకిన కారణంగా, జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తోంది. మూడు రోజుల్లో దాదాపు 30 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో ఈడీ చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?