Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నూడుల్స్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆందోళనలో ప్రపంచదేశాలు! కారణాలు ఇవే..

ఇక నూడుల్స్ అనే ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరికి రుచి చూపించింది. సన్నగా, పొడవుగా తీగవలె ఉండే ఈ నూడుల్స్ రుచికి బాగా స్పైసీగా ఉంటూ అందరికీ నోరూరిస్తుంది. ఇవి కూడా రోడ్లపై బాగా దొరుకుతుంది. దీంతో ప్రపంచంలో నూడుల్స్‌కు విపరీతమైన అభిమానులు

నూడుల్స్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆందోళనలో ప్రపంచదేశాలు! కారణాలు ఇవే..
Noodle Crisis
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2022 | 11:39 AM

Share

చాలామంది విదేశీ ఫుడ్ ను బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వాటికి ఈతరం బాగా అలవాటు పడింది. బయటికి వెళితే చాలు రకరకాల ఇనిస్టెంట్‌ ఫుడ్ లను మాత్రమే తింటారు. మొత్తానికి మన దేశ రుచులతో పాటు విదేశ రుచులు కూడా అలవాటయ్యాయి. ఇక నూడుల్స్ అనే ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరికి రుచి చూపించింది. సన్నగా, పొడవుగా తీగవలె ఉండే ఈ నూడుల్స్ రుచికి బాగా స్పైసీగా ఉంటూ అందరికీ నోరూరిస్తుంది. ఇవి కూడా రోడ్లపై బాగా దొరుకుతుంది. దీంతో ప్రపంచంలో నూడుల్స్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇక మీరుకూడా నూడుల్స్‌ అభిమానులైతే, మీకో షాకింగ్‌ న్యూస్‌. ప్రపంచవ్యాప్తంగా నూడుల్స్ సంక్షోభం పెరుగుతోంది. ఫలితంగా నూడుల్స్‌ ధర నిరంతరం పెరుగుతోంది.

నూడుల్స్‌ ధరలు పెరగడానికి కారణం ప్రపంచంలో గోధుమల ధర పెరగడం, విద్యుత్, రవాణాపై ఖర్చులు పెరగడం. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంగా తెలుస్తోంది. ఇది కాకుండా, గత సంవత్సరం కరువు, వరదలు,కరోనా కారణంగా చైనా గోధుమ ధరలో 30 శాతం వరకు పెరిగింది. గార్డియన్ నివేదిక ప్రకారం, నూడుల్స్ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న చైనా, రెండేళ్లలో తీవ్రమైన ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, సరఫరాలో అవాంతరాల కారణంగా గోధుమ ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. అయితే, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నవంబర్‌లో టన్నుకు దాదాపు $260 ఉన్న ధర ఈ ఏడాది మే మధ్యలో టన్నుకు దాదాపు $475కి పెరిగింది. ఆస్ట్రేలియాలోని థామస్ ఎల్డర్స్ మార్కెట్స్‌కు చెందిన ఆండ్రూ వైట్‌లా ప్రకారం, రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం వల్ల మార్కెట్ నుండి 30 శాతం గోధుమ రవాణాను ఒకే స్ట్రోక్‌లో తొలగించారు.

చైనా కన్సల్టెన్సీ, Mysteel, ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటికే చైనా శుద్ధి చేసిన పిండి ధరలను 10 శాతం పెంచింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో, నూడుల్స్ అతిపెద్ద తలసరి వినియోగదారు అయిన దక్షిణ కొరియాలో గోధుమల దిగుమతి ధర టన్ను $ 400కి పెరిగింది, ఇది గత 13 సంవత్సరాలలో అత్యధికం. జపాన్‌లో సోబా నూడుల్స్‌ అనే వంటకం తయారు చేసేందుకు ఉపయోగించే బక్‌వీట్‌ కొరత ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఇండోనేషియా కూడా నూడిల్స్‌ కొరతపై ఆందోళన వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆ దేశ ఆర్థిక మంత్రి కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన సప్లై చెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మేడో పూర్దర్ గోధుమల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అతని ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసే సూచనలు కనిపించడం లేదు, అందుకే నూడుల్స్ సంక్షోభం కొనసాగుతుందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి