AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిలిపి దొంగతనం చేసిన పెళ్లికొడుకు.. కళ్ళెర్ర జేసిన పెళ్లి కూతురు.. వైరల్‌ అవుతున్న వీడియో

పెళ్లి తంతు ముగిసింది..రెండు కుటుంబాల ప్రజలు కలిసి సహపంక్తి భోజనం చేస్తున్నారు. అయితే, ఈ సమయంలో సిగ్గుపడే పెళ్లికూతుళ్లు ఏమీ అనరు కానీ, కాస్త హుషారైన పెండ్లికూతుళ్లు పెళ్లిలో జరిగే అన్నీ కార్యక్రమాలను ఎంజాయ్‌ చేస్తారు. విందును కూడా ఆనందంగా ఆస్వాదిస్తారు.

Viral Video: చిలిపి దొంగతనం చేసిన పెళ్లికొడుకు.. కళ్ళెర్ర జేసిన పెళ్లి కూతురు.. వైరల్‌ అవుతున్న వీడియో
Naughty Groom
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2022 | 10:01 AM

Share

ఊరేగింపుతో వస్తున్న పెళ్లి కొడుకు కోసం ఆశగా ఎదురు చూస్తుంది నవ వధువు. ఇంకా చెప్పాలంటే బాల్కనీలో నిలబడి అతడి రాకకోసం ఎదురు చూస్తుంది. దీనిని మనం చాలా వీడియోలలో తరచుగా చూస్తూ ఉంటాము. కొన్ని వీడియోల్లో వధువు అందమైన డ్యాన్స్‌తో వరుడికి స్వాగతం పలుకుతుంటుంది. వివాహ వేదికపైనే ఆమె చేస్తున్న డ్యా్న్స్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయే వింత ఘటనలు కూడా చూస్తుంటాం..ఇక మూడుముళ్ల తతాంగం ముగుస్తుంది. వధువరూలిద్దరూ వరమాల మార్చుకుంటారు. ఆ తరువాత ఇరు కుటుంబీకులు కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. అయితే, ఈ సమయంలో సిగ్గుపడే పెళ్లికూతుళ్లు బిడియంతో ముడుచుకుని ఉంటారు. కానీ, చెలాకి పెళ్లి కూతురు అయితే, అక్కడ అందరినీ ఆటపట్టిస్తుంటారు..జయమాల తర్వాత వధూవరులు భోజనానికి కూర్చున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో వధూవరులు కలిసి కూర్చోని భోజనం చేస్తున్నారు. . పెళ్లికూతురు కాస్త వాగుడు కాయ్‌లా ఉంది..ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది..ఇదే అదునుగా ఆ పెళ్లికొడుకు ఓ చిలిపి పనిచేశాడు..ఆ పెళ్లి కూతురు తింటున్న విస్తరాకులోంచి ఓ పాపడ్‌ దొంగిలిస్తాడు..అటు ఇటు చూసిన వధువు ఒక్కసారిగా బిత్తరపోతుంది. తన ప్లేట్‌లో ఉన్న పాపడ్‌ కనిపించకపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అవుతుంది.. పెళ్లికొడుకు పళ్లెంలో చూసేసరికి అతడే దాన్ని దొంగిలించాడని అర్థమైంది. దాంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. రెండు కళ్లు ఎర్రగా చేసి, గుడ్లు పెద్దవి చేసి అతన్ని గుర్రుగా చూసింది. దాంతో పాపం ఆ వరుడు భయపడిపోయాదు. దెబ్బకు వెంటనే దొంగిలించిన పాపడ్ ని వధువు ప్లేటులో పెట్టేశాడు. వరుడు చేసిన ఈ చిన్ని చిలిపి పనితో వధువు చిర్రెత్తిపోయింది. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాంతో వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్