AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి కూతురు చేసిన చిలిపి పని.. అక్కాచెల్లెళ్లతో కలిసి నేరుగా అక్కడికే వెళ్లింది.. నెటిజన్లు ఫిదా

పెళ్లి అంటేనే ఆనందం,సందడి, సంతోషం, సంబరాలు, వరసైన వారి చిలిపిచేష్టలు, భావోద్వేగాలు అన్నీ కలిసి ఉంటాయి. పెళ్లిలో ఇరు కుటుంబాల మధ్య గౌరవం.. సరదాగా ఆటపట్టించుకోవడాలు వంటివి సహజంగా జరుగుతుంటాయి. ఇక ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి..

Viral Video: పెళ్లి కూతురు చేసిన చిలిపి పని.. అక్కాచెల్లెళ్లతో కలిసి నేరుగా అక్కడికే వెళ్లింది.. నెటిజన్లు ఫిదా
Bride Eating Panipuri
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2022 | 8:46 AM

Share

Funny Viral Video: పెళ్లి అంటేనే ఆనందం,సందడి, సంతోషం, సంబరాలు, వరసైన వారి చిలిపిచేష్టలు, భావోద్వేగాలు అన్నీ కలిసి ఉంటాయి. పెళ్లిలో ఇరు కుటుంబాల మధ్య గౌరవం.. సరదాగా ఆటపట్టించుకోవడాలు వంటివి సహజంగా జరుగుతుంటాయి. ఇక ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రజలు తమ పెళ్లి వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటున్నాయి. అవి కొన్ని గంటల్లో వైరల్ అవుతాయి. అవును, ఈ రోజుల్లో ప్రజలు ఇంటర్నెట్‌లో వధూవరుల ఫన్నీ వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఫన్నీ, షాకింగ్ వీడియోలు క్లైమాక్స్‌ను నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో.. పెళ్లి కూతురు ఆమె తోటి అక్కాచెల్లెలతో కలిసి సరదాగా చేసిన చిలిపి పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక్కడ జరిగే పెళ్లి కోసం వధువు ముస్తాబైంది. పెళ్లి దుస్తుల్లోనే తోటి వారితో కలిసి జాలిగా బయటకు వెళ్లింది. తనకెంతో ఇష్టమైన పారీపూరి తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తోంది. ఆమెతోపాటు ఉన్నవారు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తూ పానీపూరి లాగించేస్తున్నారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పానీపూరి తినడం అంటే చాలా మందికి ఇష్టమే. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, యువతులు పానీపూరి తినేందుకు ఎక్కువగా ఆసక్తిగా కనబరుస్తారు. చాలా చోట్ల జనాలు రోడ్ల పక్కన ఉండే పానీ పూరి బండ్ల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో ఉండటం గమనిస్తూనే ఉంటాం. పానీపూరి టెస్ట్‌ అలాంటిది మరీ అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by WedAbout.com (@wedabout)

పీటల మీద పెళ్లిని పక్కకు పెట్టి పానీపూరి ఆరగిస్తున్న అమ్మాయిల్ని చూసిన నెటిజన్లు వారి రుచికి ఫిదా అవుతున్నారు. ఏం అమ్మాయిల్‌ర్రా బాబు అంటూ తెగ నవ్వుకుంటున్నారు. వీడియోలోని అందమైన అమ్మాయిలు, వారు చేసిన చిలిపి పనిని పదేపదే చూసి మురిసిపోతున్నారు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో మరింత వైరల్‌గా మారి దూసుకుపోతోంది. భిన్నమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి