AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఆధ్వర్యంలో పీరియడ్స్ ఫెస్టివల్.. ఆ మూడు రోజులు నో వర్క్.. ఓన్లీ ఫన్.. ఎక్కడో తెలుసా..

మహిళల గొప్పతనాన్ని గౌరవించడానికి ఓ పండుగ నిర్వహిస్తుంది అక్కడి ప్రభుత్వం.. అదే రజా పర్బా.

ప్రభుత్వ ఆధ్వర్యంలో పీరియడ్స్ ఫెస్టివల్.. ఆ మూడు రోజులు నో వర్క్.. ఓన్లీ ఫన్.. ఎక్కడో తెలుసా..
Womanhood
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 16, 2022 | 2:26 PM

Share

రుతుస్రావం గురించి బహిర్గతంగా మాట్లాడటానికి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆలోచిస్తారు! అలాంటిది మరో జన్మను ప్రసాదించడానికి దోహదపడే ఈ ప్రక్రియను గౌరవించి, మహిళల గొప్పతనాన్ని గౌరవించడానికి ఓ పండుగ నిర్వహిస్తుంది అక్కడి ప్రభుత్వం.. అదే రజా పర్బా. దీనికి మిథున సంక్రాంతి అనే పేరూ ఉంది. ఒడిశాలో నిర్వహించే ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 3 రోజుల పాటు ‘రజా పర్బా’ నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారం ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

ఒడిశాలో మహిళల కోసం బహిష్టు పండుగ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు..దీన్నే రజా పండుగ అంటారు.. బహిష్టు, ఋతుస్రావమ్ గురించి ఈనాటికి మహిళలు బయటకు చెప్పుకోవడానికి సిగ్గు పడుతుంటారు.అందుకే బహిష్టు పండుగ పేరుతో సీఎం నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు..ఈ పండుగ మూడురోజులు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు చేసే నహిళలు సహా రాష్ట్రంలో మహిళలు ఎవరూ ఎలాంటి పనులు చేయరు..ఆట పాటలతో గడుపుతారు..వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత.. భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని (భూమాతకు రుతుస్రావం జరుగుతుందని) నమ్ముతారు అక్కడి ప్రజలు. దీంతో నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారని ఒడిశా పర్యటక అభివృద్ధి సంస్థ(ఓటీడీసీ) ఛైర్​పర్సన్​ ఎస్​ మిశ్రా తెలిపారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు ఒడిశా వాసులు.

అలాగే ఆ మూడు రోజుల పాటు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు. కొత్త చీరలు కట్టుకుని అందంగా ముస్తాబై ఆట పాటలతో కోలాహలంగా గడుపుతారు. అయితే ఈసారి కరోనా కారణంగా తక్కువ మందితో ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?