AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగర్ కర్నూలులో వెంటాడుతున్న నాగులు.. వణుకుతున్న ప్రజలు.. ఎన్ని కాట్లో తెల్సా..?

ఎర్రగడ్డ కాలనీలో ఆగివున్న ఒక కారులోకి మురికి కాలువలో నుంచి వచ్చిన పాము దూరింది. ఆ పాముని బయటకు తీసేందుకు స్థానికులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చివరకు పాములు పట్టే వక్తి పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలివేశారు.

నాగర్ కర్నూలులో వెంటాడుతున్న నాగులు.. వణుకుతున్న ప్రజలు.. ఎన్ని కాట్లో తెల్సా..?
Snake
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 17, 2022 | 3:52 PM

Share

వర్షాకాలం ఆరంభమైంది.. గత మూడు రోజుల క్రితం వరుసగా రెండు రోజుల పాటు వర్షం కురిసింది. వాన తగ్గిపోవడంతో ఎండవేడిమి, దీనికి తోడు ఉక్కపోత మొదలైంది. ఈ పరిస్థితులతో పాములు గాలి కోసం బయటి ప్రదేశానికి వస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం పాముకాటుతో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలు పాముకాటుతో జిల్లా ఆస్పత్రిలో చేరారు.. అదే సాయంత్రం ఎర్రగడ్డ కాలనీలో ఆగివున్న ఒక కారులోకి మురికి కాలువలో నుంచి వచ్చిన పాము దూరింది.

ఆ పాముని బయటకు తీసేందుకు స్థానికులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చివరకు పాములు పట్టే వక్తి పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలివేశారు. శుక్రవారం కూడా ఉదయం ఒక సైకిల్ మోటార్ లోకి పాము దూరడం స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. పామును గమనించిన యజమాని దాన్ని బయటకు తీసి చంపివేశారు. వర్షాలు ప్రారంభం కావడంతో ఎండ ప్రభావం ఉండడంవల్ల పాములు బయటి ప్రదేశాలకు వచ్చి సంచరిస్తున్నాయి. ఇది గమనించక పోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. నాగర్ కర్నూలులో పాము కాటు ప్రభావంతో ఇప్పటివరకు ఈ సీజన్లో పదిమంది వరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. పాము కాటుకు గురై ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

వాస్తవానికి ఎక్కువ మందే పాముకాటు బారిన పడ్డారు. పలువురు మృతి చెందగా వైద్యం చేయించుకున్న వారు కోలుకున్నారు. పాము కాటుతో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్న చాలా మంది మృత్యువాత పడ్డారు. ఆ వివరాలేవీ లెక్కలోకి రాలేదు. అధికారిక లెక్కల ప్రకారం పది మంది మాత్రం పాముకాటు బారిన పడ్డట్టు ఒకరిద్దరు మృతిచెందినట్లు వైద్యులు తెలుపుతున్నారు. పాము కాటు ఇంజక్షన్లు స్థానిక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచి ఈ సీజన్లో ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి