Agnipath Protest Highlights: ప్రయాణికులను అలర్ట్ చేసిన దక్షిణ మధ్య రైల్వే… టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ..
Agnipath Protest Highlights: ఆర్మీ నియామాకల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలను వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆందోళనలను హైదరాబాద్‌కు సైతం పాకిన విషయం తెలిసిందే..
Agnipath Protest Highlights: ఆర్మీ నియామాకల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలను వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆందోళనలను హైదరాబాద్‌కు సైతం పాకిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి పెద్ద ఎత్తున చేరిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లను అగ్నికి అహుతి చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలోనే పోలీసులు ఫైరింగ్ చేయడంతో ఓ యువకుడు మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. దాదాపు ఏడు గంటలపాటు నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు పలుసార్లు నిరసనకారులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు దీనికి ససేమిరా అనడంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. సాయంత్రం ఆరు గంటల వరకు వేచి చూసిన పోలీసులు రంగంలోకి దిగారు.
ఒకే సారి 4 వేల మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రరంగలోకి దిగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది. రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదని డీఆర్‌ఎమ్ గుప్తా తెలిపారు. మీడియాతో మాట్లాడిన గుప్తా.. ‘ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి ఆందోళనలు ఎప్పుడూ జరగలేదు. ఆందోళనల్లో 30 భోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18 ఎక్స్‌ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశాము. 15 రైళ్లను దూరప్రాంతాల నుంచి నడుపుతున్నాము. 7 లోకోమోటివ్ ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. రెండు లగేజీ, రెండు సాధారణ భోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పలు భోగిలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించాము’’ అని తెలిపారు.
LIVE NEWS & UPDATES
-
క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు..
రాత్రి నడిచే రైళ్లు యదాతథంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీఆర్‌పీఓ రాకేష్ తెలిపారు. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే రైళ్ల రాకపోకల్లో మాత్రం కొంత ఆలస్యం ఉంటుందని పేర్కొన్నారు.
-
అదుపులోకి వస్తున్న పరిస్థితులు..
పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. నిరసనకారులను స్టేషన్ నుంచి బయటకు పంపడంతో అధికారులు రైళ్లను తిరిగి నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో గంటలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో సేవలు సైతం 6.45 గంటలకల్లా ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
-
-
పోలీసుల యాక్షన్ ప్లాన్..
దాదాపు 7 గంటలుగా కొనసాగుతోన్న ఆందోళనకారుల నిరసనలకు ఫుల్‌స్టాప్ పడే దిశగా అధికారులు పడుతున్నాయి. ఒక్కసారిగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆందోళనకారులను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ బయటకు తీసుకొస్తున్నారు. దాదాపు నాలుగు వేల మంది పోలీసులు, స్టేషన్‌ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్ మొత్తం పోలీసుల ఆధీనంలోకి వచ్చేసింది.
-
యువకులు అర్థతంచేసుకోవాలి.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చారంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ప్రధాని మోదీ సదుద్దేశాన్ని యువత అర్ధం చేసుకోవాలని కోరారు. సికింద్రాబాద్ లాంటి విధ్వంసాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. ఆ 4 గంటలు ఏం జరిగిందంటే..?
8.20AM సికింద్రాబాద్‌కి ఒక్కోరుగా వచ్చిన యువకులు
9.00AM ప్లాట్‌ఫామ్ నెం.10 నుంచి దూసుకొచ్చిన యువకులు
9.05AM ట్రాక్‌లమీదకు చేరుకున్న యువకులు
9.15AM గూడ్స్ ట్రైన్‌లోని పార్శిల్స్ ట్రాక్‌పై వేసి నిప్పు
9.20AM ట్రాక్‌పై ఉన్న రైళ్ల ధ్వంసం
9.25AM రైళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
9.45AM పార్శిల్‌కి సిద్ధంగా ఉన్న బైకులకు నిప్పు
10AM తగలబడ్డ బోగీలు, పార్సిళ్లు, ఫర్నిచర్ ధ్వంసం
10.03AM పోలీసులపై రాళ్ల వర్షం, ఆందోళనకారులపై లాఠీచార్జ్
10.30AM 15 రౌండ్ల కాల్పులు జరిపినా.. వెనక్కి తగ్గని ఆందోళనకారులు
11AM ఒకరి మృతి, పోలీసులు, ఆందోళనకారులకు గాయాలు
11.35AM ఈస్ట్ కోస్ట్, అజంతా ఎక్స్‌ప్రెస్‌లకు తీవ్ర నష్టం
12.00PM పలు ప్లాట్‌ఫామ్స్‌పై విధ్వంసకాండ
-
-
ఆందోళన ముగిసిన వెంటనే రైళ్ల పునరుద్ధరణకు ద.మ.రైల్వే చర్యలు
ఆందోళన ముగిసిన వెంటనే రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే cpro రాకేష్ తెలిపారు. గంట లోపే ప్రధాన రైళ్ల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎమర్జెన్సీ యాక్షన్ మీటింగ్ లో అన్ని చర్యలను సిద్ధం చేసుకున్నామని తెలిపారు.
-
సికింద్రాబాద్ విధ్వంసకాండ.. క్లుప్తంగా ఏం జరిగిందంటే..?
ఆర్మీ నియామకాలకు కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ అగ్గి రాజేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి చొరబడిన వందలాది మంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. పరిస్థితులను అదుపు చేసేందుకు 15 రౌండ్ల కాల్పలు జరిపారు పోలీసులు. సికింద్రాబాద్ అల్లర్లలో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ తగలడంతో అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 13 మంది యువకులు గాయపడ్డారు.
-
సికింద్రాబాద్ విధ్వంస ఘటనపై పొలిటికల్ వార్..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంపై పొలిటికల్ వార్ నడుస్తోంది. విధ్వంసం వెనక కుట్ర మీదంటే మీదంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయ్. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ టార్గెట్‌గా పార్టీలన్నీ ఎటాక్ చేస్తుంటే.. కాషాయ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. సికింద్రాబాద్ విధ్వంసం వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ప్రమేయముందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
-
ఫైరింగ్ జరపడానికి అసలు కారణం ఇదే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఫైరింగ్‌లో యువకుడు మరణించిన సంఘటన తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్టేషన్ పక్కనే ఉన్న డీజిల్ అవుట్‌లెక్‌కు నిరసకారులు నిప్పు పెట్టే ఉద్దేశంతో దూసుకొచ్చారని, వారిని అదుపు చేసేందుకే కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. లక్షా 50 వేల లీటర్ల డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకుంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
అగ్నిపథ్‌పై అనవసర వివాదమన్న కేంద్రమంత్రి వీకే సింగ్
అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కొత్త భాష్యం చెప్పారు. ప్రతిపక్షాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే.. దీనిపై వివాదాన్ని రేపుతున్నాయని ఆరోపించారు. అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజకీయంగా మరింత దుమారం రేపుతున్నాయి.
-
పక్కా పథకం ప్రకారం విధ్వంసం.. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఆరోపణ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం వెనుక టీఆర్ఎస్, మజ్లిస్ హస్తం ఉందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బాలికపై జరిగిన అత్యాచార ఘటనను పక్కదోవ పట్టించేందుకు పక్కా పథకం ప్రకారం సికింద్రాబాద్‌లో ఆ పార్టీలు విధ్వంసం సృష్టించాయని విమర్శించారు. దేశయువతకు TRS క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
-
విధ్వంసానికి కారణం అదే.. ప్రొ.కోదండరాం వ్యాఖ్యలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సహ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సైనిక నియామక విధానమే కారణమని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. దేశ భద్రతకు కీలకమైన సైన్యంలో తాత్కాలిక నియామకాలనడం సరికాదని అన్నారు. నాలుగేళ్ల క్రితం పరీక్షలు రాసి వారిని పాత పద్ధతిలోనే నియమిస్తే బాగుంటుందని కోదండరామ్ సూచించారు.
-
రంగంలోకి దిగుతోన్న పోలీసులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిరసనకారులను స్టేషన్ నుంచి బయటకు వంపించనున్నట్లు పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే ఇంతకు ముందు ప్రకటించినట్లు 7 గంటలకు రైళ్ల పునరుద్ధరణ జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
-
విధ్వంసం వెనుక వారి హస్తం.. రఘునందన్ సంచలన కామెంట్స్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై బీజేపీ MLA రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రైల్వేస్టేషన్‌లో రైళ్లు తగలబెట్టడం వెనక టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ హస్తం ఉందన్నారు. బీజేపీని ఎదుర్కోలేకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అన్నారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో విఫలమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
-
కొనసాగుతోన్న ఉద్రిక్తత..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో మరో 48 గంటలపాటు సికింద్రాబాద్ నుంచి రైళ్లు నడవని పరిస్థితి ఉందని తెలుస్తోంది. అయితే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం అధికారులు ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి రైలును నడపనున్నారు.7 గంటలకు కాచిగూడ నుంచి దేవగిరి బయలు దేరనుంది. ఇక మరికొన్ని రైళ్లను కూడా కాచిగూడ, మౌలాలి మీదుగా మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో మరణించినవారు, గాయాల బారిన పడిన వారి వివరాలు..
మృతి చెందిన వ్యక్తి..
దామోదర రాకేష్ S/o కుమారస్వామి /18yrs R/o డబీర్పెల్ గ్రామం. వరంగల్ జిల్లా
గాయపడ్డ అభ్యర్థులు..
1) జగన్నాథ రంగస్వామి/20 సంవత్సరాలు/ 7997445866 R/o మంత్రాలయం, కర్నూలు జిల్లా 2) K. Rakesh/ S/o మల్లయ్య / 20yrs / R/o చింతకుంట గ్రామం, కరీంనగర్ జిల్లా, 7095040926. 3) J శ్రీకాంత్S/o తిరుమలయ్య / 20 సంవత్సరాలు/ పాలకొండ విల్, మహబూబ్ నగర్ జిల్లా 4) A కుమార్ S/o శంకర్ /21సంవత్సరాలు/ వరంగల్ జిల్లా/ 9581354671 5) పరశురాం S/O శంకర్/ 22 సంవత్సరాలు/ నిజాంసాగర్/ కామారెడ్డి జిల్లా 6) P. మోహన్/S/o నాగయ్య /20 సంవత్సరాలు/ నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా/ బుల్లెట్ 7) నాగేందర్ బాబు/21 సంవత్సరాలు/ ఖమ్మం 8) వక్కరి వినయ్ S/0 verkanna/20yrs/ సందేశం
-
రూ. కోట్లలో ఆస్తి నష్టం..
నిరసనకారుల దాడుల్లో రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. రైలు బోగిల్లో ఉన్న సరుకులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రస్తుతం రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది బోగీల్లో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
తగ్గేదేలా అంటోన్న నిరసనకారులు..
పోలీసులు ఎన్ని రకాలుగా చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నా నిరసనకారులు తగ్గడం లేదు. చర్చలకు ససేమిరా అంటున్నారు. పది మంది చర్చకు రామని, వస్తే అందరం వస్తామని తేల్చి చెబుతున్నారు. వెంటనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చావడానికైనా సిద్ధమని, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్‌లో హెల్ప్ డెస్క్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అధికారులు సికింద్రాబాద్ స్టేషన్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రద్దు, మళ్లింపునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయాణికులు 040-27786666 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
-
పెన్షన్ బడ్జెట్ పెరగకూడదనే ఈ అగ్నిపథ్..
సైనికుల పెన్షన్ బడ్జెట్ పెరగకూడదనే కేంద్ర ప్రభుత్వం ఉన్నపలంగా అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కేవలం పైసలు మిగుల్చుకోవడమే అగ్నిపథ్ వెనుక మోదీ సర్కారు ఉద్దేశమన్నారు ఉత్తమ్.
-
సికింద్రాబాద్ ఘటనలో మరో యువకిడి బుల్లెట్..
సికింద్రాబాద్ ఘటనలో మరో యువకుడికి బెల్లెట్ గాయమైంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో వినయ్ అనే యువకుడి చాతిలో నుంచి వెళ్లింది బుల్లెట్. దీంతో గాయపడిన వినయ్‌ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. వినయ్‌ది మహబూబాబాద్ జిల్లాగా గుర్తించారు. ఓవైపు చాతిలో బుల్లెట్ దిగినా.. వినయ్ మాత్రం పోరాడేందుకే సిద్ధపడ్డాడు. అతడిని సహచరులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వినయ్ గార్ల మండలం మద్దివంచ గ్రామంగా తెలుస్తోంది. ప్రస్తుతం వినయ్‌కి గాంధీలో చికిత్స అందిస్తున్నారు.
-
అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలి..
అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు.
-
నిరసనకారుల బండి సంజయ్ విజ్ఞప్తి..
నిరసనలను వెంటనే ఆపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. మీరంతా దేశ భక్తులు.. దేశ సేవ చేసేందుకు వచ్చారు. దయచేసి పుకార్లు నమ్మొద్దు. మీకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. అందరూ సంయమనం పాటించాలి’ అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
-
ప్రయాణికుల కోసం హెల్ప్ డెస్క్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అధికారులు సికింద్రాబాద్ స్టేషన్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రద్దు, మళ్లింపునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయాణికులు 040-27786666 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
-
అగ్నిపథ్.. దేశ రక్షణకు ప్రమాదం: ఉత్తమ్ కుమార్
సికింద్రాబాద్‌లో నెలకొన్ని నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ దేశానికి మంచిది కాదు. ఇందులో చేరుతున్న ఆ 45 వేల మందికి కూడా మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న రిక్రూమెంట్ విధానాన్నే కొనసాగించాలి. మరిన్ని చర్చలు జరిపిన తర్వాత అగ్నిపథ్‌పై పునరాలోచన చేసుకొని మళ్లీ మార్పులతో తీసుకొస్తే మంచిది’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
-
చర్చలకు అందరం వస్తాం..
10 మందిని ARO ఆఫీస్‌కి చర్చలకు పోలీసులు పిలిచిన నేపథ్యంలో నిరసనకారులు మాత్రం చర్చలకు వస్తే అందరం వస్తామని, లేదంటే లేదని తేల్చి చెబుతున్నారు. ఆర్మీ ఉద్యోగ ప్రకటన వచ్చే వరకు ట్రాక్‌పైనే కూర్చుంటామని పట్టు పట్టారు. అయితే ఇలాగే ఉంటామంటే ఊరుకునేది లేదని అడిషనల్ సీపీ శ్రీనివాస్ అభ్యర్థులను హెచ్చరిస్తున్నారు. మరి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
-
నిరసనలపై స్పందించిన పవన్ కళ్యాణ్..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయమై పవన్ ప్రకటన విడుదల చేశారు. ‘స్టేషన్‌లో నెలకొన్న ఘటనలు దురదృష్టకరమైనవి. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయి. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ పవన్ పేర్కొన్నారు.
-
చర్చలకు ఆహ్వానం..
సికింద్రాబాద్‌లో నిరసన తెలుపుతోన్న అభ్యర్థులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. పది మందిని చర్చలకు ఆహ్వానించారు. అయితే నిరసనకారులు మాత్రం 10 మంది రామని, మొత్తం 200 మంది చర్చకు వస్తామంటూ వాదిస్తున్నారు. మరి పోలీసులు, నిరసనకారుల మధ్య జరుగుతోన్న చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి.
-
మీడియాతో కిషన్ రెడ్డి..
సికింద్రాబాద్‌లో జరుగుతోన్న నిరసనలపై కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు..
-
ఫైరింగ్ జరగడం దురదృష్టకరం..
‘పోలీసుల ఫైరింగ్‌లో యువకుడు మరణించడం చాలా దురదృష్టకరం. అగ్నిపథ్ ద్వారా పర్మినెంట్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఇప్పటికే ఫిజికల్ టెస్ట్‌లకు ఎంపికైన వారు ప్రభుత్వంతో చర్చిస్తే స్పష్టత వస్తుంది కానీ, రైల్వే స్టేషన్‌లు కాల్చితే వస్తుందా.? ఇది ఏకపక్ష నిర్ణయం కాదు. ఎన్నో రోజుల నుంచి జరుగుతోన్న చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని పోస్టులకు మాత్రమే అగ్నిపథ్ ద్వారా తీసుకుంటాం. దేశంలో ఎక్కువ మంది సైన్యంలో చేరాలనే ఉద్దేశమే భారత ప్రభుత్వానికి ఉంది. యువతకు అన్యాయం చేయాలనే ఆలోచన భారత ప్రభుత్వానికి లేదు. ఫించన్ డబ్బులు మిగిలించుకోవడానికి ఈ నిర్ణయం పూర్తి అపోహ మాత్రమే. అగ్నిపథ్‌కు ఎంపికైన వారికి అన్ని రకాల నైపుణ్యాలు నేర్పిస్తాము’ అని పథకంపై మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
-
కావాలనే అపోహలు సృష్టిస్తున్నారు..
‘అగ్నిపథ్ పథకంపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారు. ఇతర దేశాల్లో ఈ విధానాల అమలును పరిశీలించిన తర్వాతే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాము. అగ్నిపథ్‌లో పనిచేస్తే ఒక క్రమశిక్షణ వస్తుంది, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాలంటరీ పథకంపై విధ్వంసం జరుగడం దురదృష్టకరం. రైల్వే స్టేషన్‌లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నిరసనకారులు ధర్న చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నిన్నటి నుంచి ఈ కార్యక్రమంపై ప్రచారం చేసుకుంటూ రైల్వే స్టేషన్‌ను టార్గెట్ చేశారు. దుకాణాలను లూటీ చేశారు. సీసీకెమెరాలను ధ్వంసం చేశారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. నిన్నటికి నిన్న గవర్నర్ గేటు దగ్గర నిరసనలు జరిగాయి. దీని వెనుక ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అగ్నిపథ్ ప్రకటించి రెండు రోజులు కూడా కాకముందే ఇలా చేయడం ప్రజాసామ్యం దేశంలో మంచిది. రెచ్చగొడితే రెచ్చి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
-
మీడియాతో కిషన్ రెడ్డి..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న నిరసనలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రెజిల్ కూడా 18 ఏళ్లు దాటిన వారు 12 నెలల పాటు ఆర్మీలో పని చేస్తారు. ఇరాన్‌లో 18 ఏళ్లు నిండిన వారు 20 నెలల పాటు, నార్త్ కొరియాలో 17 ఏళ్లు నిండిన వారు విధిగా ఆర్మీలో పనిచేయాలి. సౌత్ కొరియాలో కూడా ఆర్మీలో పని చేయాలి. మెక్సికో, యూఏఈలో కొత్తగా అమలు చేస్తున్నారు. స్విట్జర్లాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, టర్కీ, గ్రీస్‌లో యువత ఆర్మీలో చేరడం తప్పనిసరిగా ఉంది. కానీ ఇండియాలో ఇది తప్పనిసరి కాదు. దేశ సేవ చేయాలనుకునే వారే అగ్నిపథ్‌లో చేరొచ్చు. ఈ సేవ నుంచి బయటకు వచ్చిన వారు చదువుకోవచ్చు, స్టేట్, సెంట్రల్ జాబ్స్ చేయొచ్చు. అగ్నిపథ్ వీరుడు ఏదో రకంగా నైపుణ్యాలు నేర్చుకోవచ్చు’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
-
ఇబ్బందులు పడుతోన్న ప్రయాణికులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు స్టేషన్‌లో ఉన్నవారిని బయటకు పంపించడంతో వందలాది మంది బస్ స్టాప్‌లలో లగేజ్‌తో పడిగాపులు కాస్తున్నారు. నిలిచిపోయిన రైళ్లను ఎప్పుడు పునరుద్దరిస్తారోనని ఎదురు చూస్తున్నారు.
-
అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయం: టీఆర్‌ఎస్ మంత్రి
సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమన్నారు. 46 వేల మందిని 90 రోజులలో నియామకం, కేవలం రూ.30 వేల జీతం అర్దం లేని చర్య అని అన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకమని మంత్రి విమర్శించారు. పదో తరగతి పాసైన వారు అగ్నిపథ్ లో చేరి తిరిగి వెళ్లేటప్పుడు 12 వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అభ్యర్థులను
దేశ రక్షణ కోసం తీసుకుంటున్నారా .. సర్టిఫికెట్‌లో అప్రెంటీస్ షిప్ కోసం తీసుకుంటున్నారా అని మంత్రి ప్రశ్నించారు.
-
అగ్నిపథ్ స్కీమ్‌ను ఎత్తివేయాలి: ఆర్మీ అభ్యర్థులు
అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోనూ విద్యార్థులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పటించి నిరసన తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇక అగ్నిపథ్ స్కీమ్‌ను ఎత్తివేయాలని ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
-
భారత దేశం గురించి హదీసులో ఇలా రాశారు- కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ TV9 గ్లోబల్ సమ్మిట్‌తో మాట్లాడుతూ ప్రపంచంలో ఐదు ప్రధాన నాగరికతలు మాత్రమే ఉన్నాయని చాలా మంది ప్రముఖ చరిత్రకారులు చెప్పారని.. వాటిలో జ్ఞాన వ్యాప్తికి గుర్తింపు పొందిన ఏకైక నాగరికత భారతదేశం అని అన్నారు. నేను భారతదేశం నుంచి వస్తున్న జ్ఞానాన్ని అనుభవిస్తున్నా మని హదీసులో వ్రాయబడింది.
-
విజయవాడ రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్‌లలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లన్ని రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. రైళ్లు రద్దు కావడం, దారి మళ్లించడం వంటి పూర్తి వివరాల కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 0866-2767055 0866-2767075 ఈ నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
-
హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైళ్లు రాకపోకలన్ని చిలినిపోగా, తాజాగా మెట్రో రైళ్లను కూడా నిలిచివేసింది. సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో మెట్రో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
#importantannouncement pic.twitter.com/bp4uzkOTJ2
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) June 17, 2022
తదుపరి ప్రకటన వచ్చే వరకు ప్రయాణికులు సహకరించాలని మెట్రో అధికారులు తెలిపారు.
-
గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల బందోబస్తు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వజ్ర వాహానాలను స్టేషన్ వద్దకు తరలించారు పోలీసులు.
-
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమైన కిషన్ రెడ్డి
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంటున్న విధ్వంసంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశం అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న హింస పై చర్చస్తున్నారు.
-
దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధ పడ్డ వారికి ఇచ్చే గౌరవం ఇదేనా?
సైనికుల నియమకాలలో అగ్నిపత్ పేరుతో 4 ఏళ్ళు సర్వీస్ పెట్టడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని, గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ తోపాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమని ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధ పడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా.. అని మండిపడ్డారు.
-
40 బైక్‌లను తగులబెట్టిన ఆందోళనకారులు
సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. రైలు బోగీలతోపాటు 40 బైక్‌లకుపైగా నిప్పటించారు ఆందోళనకారులు. పార్శిళ్లు, ఫర్నిచర్స్‌ను ట్రాక్‌పై ఉంచి నిప్పటించారు.
-
నిరసనలు ఆపకపోతే కాల్పులు తప్పవు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు ఆపకపోతే కాల్పులు తప్పవని పోలీసులు ఆందోళనకారులను హెచ్చరిస్తున్నారు. దీంతో కాస్త సద్దుమణిగిన ఆందోళనలకారుల అల్లర్లు మళ్లీ మొదలవుతున్నాయి.
-
వరల్డ్ టాలెంట్ ఫ్యాక్టరీ అనే అంశంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతున్నారు
గ్లోబల్ సమ్మిట్‌లో వరల్డ్ టాలెంట్ ఫ్యాక్టరీ అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా యాదవ్ కార్మిక మంత్రిత్వ శాఖ విధానంపై చర్చిస్తున్నారు.
-
మొత్తం 71 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో మొత్తం 71 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. అల్లర్లు సద్దుమణిగిన తర్వాత పునరుద్దరిస్తామని చెబుతున్నారు పోలీసులు.
-
నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను మూసివేశారు పోలీసులు. ప్రయాణికులు లోపలికి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు నాంపల్లి పోలీసుస్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
-
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
సికింద్రాబాద్‌లో ఆందోళనకారుల అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు. నిలిచిపోయిన రైళ్లను రీషెడ్యూల్ చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
-
అగ్నిపథ్ ఆందోళనలు: ఇతర రాష్ట్రాల లైవ్ అప్‌డేట్స్ కోసం..
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్‌ను చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి
-
సికింద్రాబాద్ అల్లర్లలో మృతి చెందిన విద్యార్థి దామోదర్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి దామోదర్ కురేషిగా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి కుమారస్వామి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డుకు వెళ్లి అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు.
-
వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో భారీ పోలీస్ భద్రత..
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అప్రమత్తం అయ్యారు పోలీసులు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా భారీగా మోహరించిన పోలీసులు. కాజీపేట, వరంగల్ స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్ వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు రైల్వే అధికారులు.
-
విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్..
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.ఆర్మీ , రైల్వే పోలీసులు ఆధీనంలో స్టేషన్ పరిసరప్రాంతాలు ఉన్నాయి.
-
ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లు రద్దు అయ్యాయి. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
-
సికింద్రాబాద్ విధ్వంసంలో తగులబడిన మూడు రైళ్లు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనలో మూడు రైళ్లు తగులబడుతున్నాయి. ఈస్ట్ కోస్ట్, అజంతా ఎక్స్ ప్రెస్ లకు తీవ్ర నష్టం వాటిల్లింది.
-
సికింద్రాబాద్‌లో రైళ్ల రాకపోకలు బంద్
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైళ్లకు నిప్పంటిస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లపై అత్యవసర భేటీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారుల అల్లర్లపై ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు రైల్వే జీఎం. ఆస్తి నష్టం, ప్రయాణికులకు ప్రత్యామ్నాయంపై చర్చిస్తున్నారు. ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులపై చర్చిస్తున్నారు. ఆందోళనకారులను ఎలా అప్రమత్తం చేయాలనే విషయమై చర్చిస్తున్నారు.
-
అగ్నిపథ్ ఆందోళన కేంద్రానికి కనువిప్పు కావాలి- కేటీఆర్ ట్వీట్
అగ్నిపథ్ ఆందోళన కేంద్రానికి కనువిప్పు కావాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతవుందో స్పష్టమవుతుందని అన్నారు.
The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country
Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़
From One Rank – One Pension to proposed No Rank – No Pension!
— KTR (@KTRTRS) June 17, 2022
ముందు రైతుల జీవితాలతో ఆడుకున్నారు.. ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. మొదట వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అన్నారు.. ఇప్పుడు నో ర్యాంక్-నో పెన్షన్ అంటున్నారు అంటూ ఆరోపించారు.
-
అగ్నిపథ్ ఆందోళనలపై రేవంత్ రెడ్డి ట్విట్
అగ్నిపథ్ ఆందోళనలపై రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయం ఫలితం ఇదని అన్నారు. దేశ భక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగుతుంటే అగ్నిపథ్ సరైనది కాదని ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే ఘటన పై ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ కంట్రోల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులతో gm అరుణ్ కుమార్ జైన్ అత్యవసర భేటీ అయ్యారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం.
మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం,పాత విధానాన్నే కొనసాగించాలి. pic.twitter.com/DotzZcpXCL
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2022
ఆందోళనకారులు స్టేషన్‌లోకి ఎలా ప్రవేశించారు.. ఎంత మేర నష్టం వాటిల్లింది.. ప్రయాణీకులకు ప్రత్యామ్నాయంపై చర్చిస్తున్నారు.
-
రైల్వే స్టేషన్‌లో బైక్‌లకు నిప్పటించిన ఆందోళనకారులు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. 20 బైక్‌లకుపైగా నిప్పటించారు ఆందోళనకారులు. పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు.
-
పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫ్లాట్‌ఫాం నెం1 వద్ద ఒకరు మృతి చెందారు.
-
తగులబడుతున్న బోగీలు, పార్సిళ్లు, ఫర్నిచర్స్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం తీవ్రంగా కొనసాగుతోంది. రైలు పట్టాలపై పార్సిళ్లు, ఫర్నిచర్స్ ధ్వంసం చేశారు. అలాగే రైలు బోగీలను సైతం ఆందోళనకారులు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరుపుతున్నారు. దాడులను అడ్డుకుంటున్నారు.
-
కేంద్రం అప్రమత్తం
దేశ వ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలో భద్రతను పెంచింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పోలీసులు భారీగా మోహరించారు.
-
అగ్నిపథ్ స్కీమ్‌ను సమర్థించుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమర్థించుకున్నారు. రక్షణ రంగంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పథకం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. భద్రతా బలగాల్లో గత రెండేళ్లుగా ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. అందుకే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచి 23 ఏళ్ల వరకు(ఇది వరకు 21 ఏళ్లుగా ఉండేది) అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు.
#WATCH | For the last 2yrs, young people didn’t get the opportunity to get inducted into Armed forces due to no recruitment process. Thus… govt decided to increase the upper age limit from 21yrs to 23yrs. It’s a one-time relaxation…: Defence Minister Rajnath Singh#Agnipath pic.twitter.com/UfP5z0zakY
— ANI (@ANI) June 17, 2022
-
పోలీసులపై రాళ్లు విసురుతున్న ఆందోళనకారులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. అగ్నిపథ్ పథనానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో నిరసనకారులపై పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు.
-
రైల్వే స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేత
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 15 రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు.
-
బీహార్‌లో రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు – Watch Video
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బీహార్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రైల్వే స్టేషన్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. లక్ష్మినియా రైల్వే స్టేషన్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
#WATCH | Bihar: Protesting against #AgnipathRecruitmentScheme, agitators vandalise Lakhminia Railway Station and block railway tracks here. pic.twitter.com/H7BHAm8UIg
— ANI (@ANI) June 17, 2022
-
కాల్పుల్లో పలువురికి గాయాలు
సికింద్రాబాద్‌లో ఆందోళన చేస్తున్న నిరసన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులకు గాయాలు అయ్యాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. స్టేషన్ మొత్తంలో రణరంగంగా మారింది.
-
సికింద్రాబాద్: ఆందోళనకారులపై కాల్పులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆగ్నిపథ్ వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రణరంగంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్‌లో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులపై కాల్పులు జరుపుతున్నారు.
-
సికింద్రాబాద్‌లో రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
సికింద్రాబాద్‌లో రైలును తగలబెట్టిన ఆందోళనకారులు..
#WATCH | Telangana: Secunderabad railway station vandalised and a train set ablaze by agitators who are protesting against #AgnipathRecruitmentScheme. pic.twitter.com/2llzyfT4XG
— ANI (@ANI) June 17, 2022
-
రైలు పట్టాలపై పార్సిళ్లకు నిప్పు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త నెలకొంది. ఆర్మీ పరీక్ష కోసం వచ్చిన యువకులు ఆందోళన దిగారు. అగ్నిపథ్‌ను రద్దుచేసి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ యధాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైలు పట్టాల మధ్యలో పార్సల్ సామాన్లు వేసి నిప్పు పెట్టారు యువకులు.
-
దేశవ్యాప్తంగానూ పలుచోట్ల ఆందోళనలు..
అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు. పూర్తి కథనం చదవండి..
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లకు నిప్పు
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్ని పథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ మూడు రైళ్లకు నిప్పటించారు ఆందోళనకారులు.
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త తనెలకొంది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వేస్టేషన్‌లో చొచ్చుకువచ్చా
-
సికింద్రాబాద్‌లోనూ అగ్నిపథ్ మంటలు
దేశం వ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మంటలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కూడా తాకాయి.
Published On - Jun 17,2022 10:32 AM