Bandi Sanjay Arrest: బండి సంజయ్ అరెస్ట్.. బిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత
IIIT Students Protest: కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసరకు బయలుదేరారు. బండి సంజయ్ రాకతో పోలీసు శాఖ
కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాసరకు బయలుదేరారు. బండి సంజయ్ రాకతో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. టోల్‌ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు టోల్‌ప్లాజా వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుని బికనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చేసే అవకాశం ఉండటంతో టోల్‌ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు పోలీసులు. బీజేపీ నాయకుల వాహనాలను ముందుకు వెళ్లకుండా వలయంగా ఏర్పడ్డ పోలీసులు. బండి సంజయ్ ను అడ్డుకోవడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులను సంఘటన స్థలంలోంచి లాకెళ్లారు పోలీసులు. జాతీయ రహదారిపై బైటాయించిన బీజేపీ నాయకులు. పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకె ట్రిపుల్ ఐటీకి వెళుతున్నానని చెప్పారు బండి సంజయ్. విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటని నిలదీశారు. వాళ్లేమైన తీవ్రవాదుల? అంటూ ప్రశ్నించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా? అని మండిపడ్డారు. విద్యార్థులేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. సీఎం విద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు బండి సంజయ్. సమస్యలు తెలుసుకోవాలని వెళితే అడ్డుకుంటారా? అని పోలీసులను ప్రశ్నించారు.
ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులేనన్నారు. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా? అని వాపోయారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామన్నారు. ట్రిపుల్ ఐటీ వెళ్లి తీరుతనని స్పష్టం చేశారు బండి సంజయ్. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ వెంటనే విఆర్ఎస్ పొందటం ఖాయమన్నారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నీళ్లు, పవర్ కట్ చేయడం మూర్ఖత్వమన్నారు. స్థానిక అధికారులు విద్యార్థులను భయపెడుతున్నారని ఆరోపించారు. ఇదే విధంగా వ్యవహరిస్తే… కొత్త విద్యా సంస్థల మంజూరు కష్టంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్తులు ద్వసం చేయడం మానుకొవాలన్నారు. ఆలస్యంగానైనా సమస్యలు గుర్తించడం మంచిదేనని హితవు చెప్పారు.