Telangana: ఆర్మీ నోటిఫికేషన్‌పై ఇంతటి నిరసనా? ఈ రేంజ్‌లో విధ్వంసమా?.. సికింద్రాబాద్ ఘటనపై పలు అనుమానాలు

కలలో కూడా ఊహించని విధ్వంసం. గతంలో ఎన్నడూ చూడనటివంటి నిరసన. ఉత్తరాదిన మాత్రమే కనిపించే సీన్స్‌. మన సికింద్రాబాద్‌లో ఎలా జరిగింది? ఇంతకంటే ఎక్కువ భావోద్వేగాలు, ఉద్రిక్తతల మధ్య సాగిన తెలంగాణ ఉద్యమంలో...

Telangana: ఆర్మీ నోటిఫికేషన్‌పై ఇంతటి నిరసనా? ఈ రేంజ్‌లో విధ్వంసమా?.. సికింద్రాబాద్ ఘటనపై పలు అనుమానాలు
Secunderabad Railway Statio
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 17, 2022 | 5:19 PM

కలలో కూడా ఊహించని విధ్వంసం. గతంలో ఎన్నడూ చూడనటివంటి నిరసన. ఉత్తరాదిన మాత్రమే కనిపించే సీన్స్‌. మన సికింద్రాబాద్‌లో ఎలా జరిగింది? ఇంతకంటే ఎక్కువ భావోద్వేగాలు, ఉద్రిక్తతల మధ్య సాగిన తెలంగాణ ఉద్యమంలో సైతం ఇలాంటి ఇన్సిడెంట్‌ జరగలేదు. అలాంటిది, ఒక ఆర్మీ నోటిఫికేషన్‌పై ఇంతటి నిరసనా? ఈ రేంజ్‌లో విధ్వంసమా? వీళ్లంతా నిజంగానే ఎవరికివాళ్లు కదిలివచ్చారా? లేక ఏదైనా కుట్ర ఉందా? ఇదే ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. వంద మంది కాదు, రెండొందల మంది కాదు, వేల మంది ఒక్కసారిగా స్టేషన్‌పై పడ్డారు. మరి, అన్ని వేలమంది ఆందోళకారులు ఒక్కసారిగా రైల్వేస్టేషన్‌లోకి చొరబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రతిరోజూ లక్షలాది మంది రాకపోకలు సాధించే అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్‌లో ఎందుకీ భద్రతా వైఫల్యం?. అసలు, ఆ ఆందోళనకారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇవే ఇప్పుడు డౌట్స్‌ రైజ్ చేస్తున్నాయి. వాళ్లంతా ఏఏ ప్రాంతాల నుంచి వచ్చారు ? ఆందోళనకారుల్లో ఉత్తరాదివాళ్లు కూడా ఉన్నారా? వచ్చినవాళ్లంతా ఆర్మీ నిరుద్యోగులేనా? లేక నిరుద్యోగుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయా? అనే ప్రశ్నలకు ఆన్సర్స్‌ చెప్పాల్సింది పోలీసులే.

ఉదయం 9గంటల దాకా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ప్రశాంతంగా ఉంది. ప్రయాణికులతో సందడిగా బిజీబిజీగా కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పెద్ద సంఖ్యలో యువకులు స్టేషన్‌లోకి ఎంటరయ్యారు. కొంతమంది ముందుగానే రాళ్లు చేతబట్టుకున్నారు. ఇంకొందరు కర్రలు పట్టుకున్నారు. స్టేషన్‌లోకి ఎంటరవుతూనే దాడికి తెగబడ్డారు. ఒక్కొక్కరుగా వందలమంది గుమిగూడారు. ఒకర్ని చూసి మరొకరు రెచ్చిపోయారు. పార్సిల్ కౌంటర్లపై దాడి చేశారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేశారు. రైలు పట్టాలపై సామాగ్రిని పడేసి నిప్పు పెట్టారు.

అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అంతటితో శాంతించకుండా నిరసనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. అయినా ఎక్కడా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారుల ఆందోళనతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి