AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath: అగ్గిరాజేసిన అగ్నిపథ్.. పలు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు.. రైళ్లకు నిప్పు, బీజేపీ ఆఫీస్ లపై దాడులు

సైన్యంలో భర్తీకి కేంద్రం ప్రకటించిన కొత్త నియామక పాలసీ అగ్నిపథ్(Agnipath) కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి....

Agnipath: అగ్గిరాజేసిన అగ్నిపథ్.. పలు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు.. రైళ్లకు నిప్పు, బీజేపీ ఆఫీస్ లపై దాడులు
Secunderabad Railway Statio
Ganesh Mudavath
|

Updated on: Jun 17, 2022 | 6:21 PM

Share

సైన్యంలో భర్తీకి కేంద్రం ప్రకటించిన కొత్త నియామక పాలసీ అగ్నిపథ్(Agnipath) కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. పలు రైళ్లకు నిప్పు పెట్టి, భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు నాంపల్లి(Nampalli) రైల్వే స్టేషన్ సహా రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. అగ్నిపథ్ తో రాత పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు ఆందోళన తెలుపుతున్నట్లు సమాచారం. బిహార్ లోని లఖీసరాయ్ జిల్లాలో బీజేపీ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. దానాపూర్, బలియా బాగల్ పూర్, బక్సర్, ఆరా రైల్వే స్టేషన్లలో రైళ్లకు నిప్పుపెట్టారు. బీహార్ డిప్యూటీ సీఎం రేణు దేవీ నివాసంపై దాడి చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లాలోని రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. రైలు బోగీలకు నిప్పుపెట్టి విధ్వంసం కలిగించారు.

ఢిల్లీలో సంయుక్త రోజ్ గార్ ఆందోళన సమితి బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసనకారుల ప్రదర్శనలు చేపట్టారు. నాలుగేళ్ల నియామకం వద్దంటూ నినాదాలు చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్ కు సైతం ఆందోళనలు విస్తరించాయి. కాగా.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపథ్ కింద భర్తీ ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

గరిష్ఠ వయో పరిమితి 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. సైన్యంలో ఉద్యోగం అనేది దేశ సేవలో భాగమని వివరించారు. మెరిట్ ప్రకారం నాలుగేళ్ల తర్వాత 25 శాతం మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్