Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చల్లారని ఉద్రిక్తత.. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
అగ్నిపథ్(Agnipath) పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకారులు చేసిన నిరసనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అట్టుడికింది. ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణంలో మునిగిపోయింది. ఘటన జరిగినప్పటి నుంచే పలు రైళ్లు సర్వీసులకు అంతరాయం...

అగ్నిపథ్(Agnipath) పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకారులు చేసిన నిరసనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అట్టుడికింది. ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణంలో మునిగిపోయింది. ఘటన జరిగినప్పటి నుంచే పలు రైళ్లు సర్వీసులకు అంతరాయం కలగింది. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి అదుపులోకి వస్తుందని భావించినప్పటికీ సికింద్రాబాద్(Secunderabad) స్టేషన్ లో పరిస్థితులు చక్కబడలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వే లైన్లు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు .మరో 50 గంటల పాటు రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ లో ఆందోళనలతో దక్షిణ మధ్య రైల్వేలో రాకపోకలు స్తంభించాయి. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రతిరోజూ 295 రైళ్లు నడుస్తాయి. సాయంత్రం4 30 నుంచి సుమారు 165కి పైగా రైళ్లు బయల్దేరతాయి. కాగా.. ఈ గొడవలతో పలు రైళ్లు పూర్తిగా రద్దవగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.
హైదరాబాద్-షాలిమార్ 18046 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, 17230 సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్ ప్రెస్, 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, 12791 సికింద్రాబాద్–దానాపూర్ ఎక్స్ ప్రెస్, 17002 సికింద్రాబాద్–సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, 12792 దానాపూర్ – సికింద్రాబాద్, 22644 పట్నా–ఎర్నాకుళం ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లు రద్దయ్యాయి. 12703 హౌరా-సికింద్రాబాద్, 17234 సిర్పూర్ కాగజ్ నగర్–సికింద్రాబాద్,17201 గుంటూరు-సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బదులుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరతాయి.
మరోవైపు.. అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. నిరసనకారుల బీభత్సానికి స్టేషన్‌లోని కీలక వస్తువులు ధ్వంసమయ్యాయి. రైల్వే పట్టాలపై సికింద్రాబాద్ ఆందోళన ఘటనలో మూడు రైళ్లు దెబ్బతిన్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఉదయం 9 గంటలకే ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి వచ్చారన్న ఆయన ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా తరలించామని చెప్పారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి