Andhra Pradesh: వేగంగా విస్తరిస్తున్న నైరుతి.. వచ్చే మూడు రోజులు వర్ష సూచన

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పటికే ప్రవేశించిన నైరుతి మరింత ముందుకు కదులుతున్నాయి. అంతే కాకుండా తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లోని మరికొన్ని...

Andhra Pradesh: వేగంగా విస్తరిస్తున్న నైరుతి.. వచ్చే మూడు రోజులు వర్ష సూచన
rains
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 4:10 PM

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పటికే ప్రవేశించిన నైరుతి మరింత ముందుకు కదులుతున్నాయి. అంతే కాకుండా తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మధ్యప్రదేశ్, విదర్భలోని మిగిలిన ప్రాంతాలలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య & వాయువ్య బంగాళాఖాతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి వచ్చే మూడు రోజులు మరింత విస్తరించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా.. రాబోయే మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తా, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడి పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈ రోజు, రేపు, ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

మరో వైపు.. నైరుతి రుతుపవనాలు(Monsoon) కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే వచ్చేశాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆదివారమే కేరళ(Kerala) ను తాకినట్లు వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా రుతు పవనాల కదలికల్లో వేగం పెరిగిందని వివరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023