Andhra Pradesh: జాబ్‌ క్యాలండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష.. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కీలక అడుగు పడింది. ప్రతీ ఏటా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ మేరకు...

Andhra Pradesh: జాబ్‌ క్యాలండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష.. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 17, 2022 | 5:30 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కీలక అడుగు పడింది. ప్రతీ ఏటా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ (CM Jagan) అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలుపై శుక్రవారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జాబ్‌ క్యాలెండర్లో మిగిలిన 8వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏడాది కాలంగా జరిగిన నియామకాలు, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై జగన్‌ అధికారులతో చర్చించారు. 2021–22 జాబ్‌ కాలెండర్‌ ద్వారా 39,654 ఉద్యోగాల భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాక్‌లాగ్ పోస్టులు, ఏపీపీఎస్‌సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య శాఖల్లో నియామకాలపై సీఎం తాజా సమీక్షలో చర్చించారు.

వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మొత్తం గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల నియామకాలను ఈ ఒక్క ఏడాదిలో పూర్తి చేయాలని తెలిపారు. విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామమన్న ముఖ్యమంత్రి రెగ్యులర్‌పోస్టులతో పాటు, కాంట్రాక్టు పోస్టులను పారదర్శకంగా నియమకాలు జరగాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కూడా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..